ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు కూడా సరదాగా ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి సానుకూల శక్తి, ధనం, ఐశ్వర్యం తీసుకు వస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న వచ్చింది. అలాగే ఇప్పటికే అందరూ వారి ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెట్టి ఉంటారు. ఇల్లు, ఆఫీసు, షాపులు కూడా దీపావళికి శుభ్రం చేస్తారు.
దీపావళి నాడు అందమైన దీపాలు, లైటింగ్‌లు పెట్టి అలంకరిస్తారు. అయితే దీపావళికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలంటే కొన్నింటిని తొలగించాలి. దీపావళికి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు వీటిని తొలగించకపోతే ప్రతికూల శక్తి అలాగే ఉంటుంది, పేదరికంతో బాధపడాలి. సానుకూల శక్తి కలిగి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే వీటిని తప్పక తొలగించడం మంచిది. మరి దీపావళికి ఎటువంటి వాటిని తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాతవి, పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు, పనిచేయని గడియారాలు వంటి వాటిని ఇంటి నుంచి తొలగించాలి. లేదంటే వాటిని రిపేర్ చేసి మళ్లీ ఇంట్లో ఉంచండి. లేకపోతే ప్రతికూల శక్తిని, పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పనికిరాని ఎలక్ట్రానిక్ సామాన్లు ఇవ్వాలని కూడా ప్రతికూల శక్తి వస్తుందని గమనించండి.
చాలామంది పాత డబ్బాలు, పనికిరానివి ఇంట్లో పెడుతూ ఉంటారు. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి, పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాటిని కూడా తొలగించండి.
దీపావళికి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు పగిలిపోయిన గాజు సామాన్లు వంటి వాటిని తొలగించండి. లేకపోతే అనవసరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
విరిగిపోయిన సోఫాలు, మంచాలు, కుర్చీలు ఇలాంటివన్నీ కూడా ఇంటి నుంచి తొలగించాలి. లేకపోతే దీపావళికి ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు రావచ్చు, కెరీర్‌లో కూడా సమస్యలు రావచ్చు.
పాత బట్టలు, ఉపయోగించని, చిరిగిపోయినవి ఇంటి నుంచి తొలగించాలి. అలా తొలగించకపోతే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అదేవిధంగా తెగిపోయిన చెప్పులు, పనికిరానివి తొలగించండి. లేకపోతే దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. చీపురు ఎప్పుడూ సరైనదిగా ఉండాలి. ఒకవేళ చీపురు పూర్తిగా పాడైపోయి ఉంటే సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అదే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.