హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. పెద్దల నుంచి పిల్లల వరకు దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అయితే, దీపావళికి ముందు ఇంటిని అందంగా ఉంచడం, శుభ్రం చేయడం చాలా అవసరం. దీపావళి పండుగ నాడు ఇళ్ళు కళకళలాడుతూ, దీపాల వెలుగులతో అందంగా ఉంటాయి. దానికి ముందు ఇంటిని శుభ్రం చేయడం చాలా అవసరం.
ఈసారి దీపావళి అక్టోబర్ 20న వచ్చింది. కనుక దానికంటే ముందే ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇవి కనక మీకు కనపడితే.. మీతో లక్ష్మీదేవి ఉందని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని, సుఖసంతోషాలతో ఉంటారని సంకేతం. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవట.
దీపావళికి ఇంటిని సర్దేటప్పుడు ఇవి కనపడితే మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. సంతోషంగా ఉండొచ్చు. మరి దీపావళికి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఏవి కనపడితే శుభఫలితాలు ఎదురవుతాయో చూద్దాం.
డబ్బు: అప్పుడప్పుడు మనం డబ్బులను ఎక్కడపడితే అక్కడ వదిలేస్తూ ఉంటాము. అవి ఎప్పుడూ మనకి శుభ్రం చేసేటప్పుడు కనపడుతూ ఉంటాయి. కొంతమంది పాత పర్సులో, జేబుల్లో కూడా వదిలేస్తూ ఉంటారు. అయితే ఇంటిని సర్దేటప్పుడు డబ్బు కనపడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి అదృష్టాన్ని కూడా తీసుకురానుందని అర్థం చేసుకోవాలి.
బియ్యం లేదా ధాన్యం: శుభ్రం చేసేటప్పుడు బియ్యం లేదా ధాన్యం కనపడితే చాలా మంచిదట. శుక్రుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు.
ఎర్రటి వస్త్రం: దీపావళికి ఇంటిని సర్దేటప్పుడు ఎర్రటి వస్త్రం కనబడితే, మంచి జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి. దీపావళికి నాడు శుభఫలితాలు ఎదురవుతాయని దానికి సంకేతం.
శంఖం లేదా గవ్వలు: దీపావళికి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శంఖం లేదా గవ్వలు కనబడితే మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. డబ్బుకి లోటు ఉండదట.
నెమలీకలు: దీపావళికి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నెమలీకలు కనబడినట్లైతే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణు అనుగ్రహం మీపై ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కూడా త్వరలో తీరిపోతాయని సంకేతం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.