హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకొని దీపాలతో అలంకరిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతీ ఏటా మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు దీపావళి వస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. దీపావళి అక్టోబర్ 20న వచ్చింది. ఐదు రోజులపాటు దీపావళిని జరుపుతారు.
దీపావళి నాడు ఏ రాశి వారు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా ఆచరిస్తే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందవచ్చు. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి మీ రాశి ప్రకారం దీపావళి నాడు ఏ రంగు దుస్తులు ధరిస్తే కలిసి వస్తుందో తెలుసుకోండి.
మేష రాశి వారు దీపావళి నాడు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఈ విధంగా ఆచరించడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందవచ్చు. ఆనందం కూడా ఉంటుంది.
వృషభ రాశి వారు దీపావళి నాడు నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఈ విధంగా ఆచరిస్తే మహాలక్ష్మి అనుగ్రహం పొందవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
మిధున రాశి వారికి నారింజ రంగు దుస్తులు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారు ఆ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ధనలక్ష్మి ప్రత్యేక ఆశీస్సులు పొందడానికి వీలవుతుంది.
కర్కాటక రాశి వారు దీపావళి నాడు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిదే. ఇలా చేయడం వలన బాగా కలిసి వస్తుంది.
సింహ రాశి వారు గోధుమ రంగు దుస్తులు ధరించి లక్ష్మీ పూజ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఈ రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో పాటు బాధలన్నీ తీరిపోతాయి.
కన్యా రాశి వారు దీపావళి నాడు తెల్లని దుస్తులు ధరిస్తే మంచిది. ఆ విధంగా పాటిస్తే ఆనందం, శాంతి కూడా ఉంటాయి.
తులా రాశి వారు దీపావళి నాడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే బాగా కలిసి వస్తుంది. సంతోషంగా ఉండచ్చు.
వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందడానికి వీలవుతుంది. సంపద కూడా పెరుగుతుంది.
ధనుస్సు రాశి వారు పర్పుల్ రంగు దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుంది. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కూడా వీరిపై ఉంటుంది.
మకర రాశి వారు దీపావళి నాడు నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందవచ్చు. సంతోషంగా ఉండొచ్చు.
కుంభ రాశి వారు దీపావళి నాడు బూడిద రంగు దుస్తులు ధరిస్తే బాగా కలిసి వస్తుంది.
మీన రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే గులాబీ రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.