ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20న, 21న? పండుగ తేదీలతో పాటు ఈ వాస్తు పరిహారాలను కూడా తెలుసుకోండి!-diwali 2025 festival dates also check vastu remedies for prosperity and lakshmi devi blessings check it now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20న, 21న? పండుగ తేదీలతో పాటు ఈ వాస్తు పరిహారాలను కూడా తెలుసుకోండి!

ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20న, 21న? పండుగ తేదీలతో పాటు ఈ వాస్తు పరిహారాలను కూడా తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటాము. కేవలం హిందువులే కాదు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుతారు. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20న, 21న? పండుగ తేదీలతో పాటు ఈ వాస్తు పరిహారాలను కూడా తెలుసుకోండి.

దీపావళి పండుగ ఎప్పుడు? (pinterest)

దీపావళి పండుగ 2025: హిందువులు జరుపుకునే విశిష్టమైన పండుగలో దీపావళి పండుగ కూడా ఒకటి. ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ అని చెప్పొచ్చు. అదే విధంగా దీపావళి నాడు టపాసులు కాలుస్తారు, పిండి వంటలు వండుతారు, స్వీట్లు వంటివి పంచిపెడతారు.

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థము. చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటాము. కేవలం హిందువులే కాదు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుతారు.

దీపావళి పండుగ ఎప్పుడు?

ఈసారి దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది? ధంతేరాస్‌, నరక చతుర్దశి కూడా ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం. ఐదు రోజుల అందమైన పండుగ దీపావళి పండుగ ధంతేరాస్‌తో మొదలై, భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. దీపావళిని చాలా చోట్ల రెండు రోజులు జరుపుకుంటారు. ఒకటి దీపావళి, మరొకటి నరక చతుర్దశి. దీపావళి నాడు లక్ష్మీ పూజ కూడా జరుపుతారు. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20న వచ్చింది.

దీపావళి పండుగ 2025

అక్టోబర్‌ 18 శనివారం, ధంతేరాస్‌

అక్టోబర్ 19 ఆదివారం, నరక చతుర్దశి

అక్టోబర్ 20 సోమవారం, దీపావళి

అక్టోబర్ 21 మంగళవారం, గోవర్ధన పూజ

అక్టోబర్ 22 బుధవారం, భాయ్ దూజ్‌

దీపావళి నాడు సానుకూల శక్తి కలగాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఈ వాస్తు చిట్కాలను పాటించండి

  1. దీపావళి నాడు కొన్ని పరిహారాలను వాస్తు ప్రకారం పాటించడం వలన సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. దీపావళికి ఇంకా సమయం ఉంది. కాబట్టి వాస్తు ప్రకారం ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.
  2. పగిలిపోయిన గాజు లేదా పాత్రలు వంటి వాటిని తొలగించండి. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి, కుటుంబ సభ్యులపై దుష్ప్రభావాన్ని చూపుతాయి.
  3. పనిచేయని గడియారాలు ఉంటే వాటిని కూడా దీపావళికి ముందే తొలగించండి. ఇవి అనేక రకాల సమస్యలను కలిగిస్తాయి.
  4. పాత, విరిగిపోయిన ఫర్నిచర్ కూడా ఇంటి నుంచి తొలగించాలి. దీపావళికి ఇలాంటివి ఇంట్లో ఉండడం వలన ప్రతికూల శక్తి కలిగి, సానుకూల శక్తి తొలగిపోతుంది. అదృష్టం, శ్రేయస్సుకి కూడా అడ్డుపడుతుంది.
  5. అలాగే పాత ఇనుప పాత్రలు, పనికిరాని పాత్రలు కూడా తొలగించాలి. లేదంటే శని, రాహువు ప్రభావాలు కలుగుతాయి.
  6. దీపావళికి ముందు ఇంటిని శుభ్రపరచాలి. దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించాలి. పూజ మందిరంలో విరిగిపోయిన విగ్రహాలు వంటి వాటిని తొలగించండి.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.