దీపావళి వచ్చేస్తోంది.. ఆ రోజు మీ రాశి ప్రకారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అదృష్టం ఉంటుంది!-diwali 2025 buy these on deepavali according to zodiac signs to get lots of luck and lakshmi devi blessings check it now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  దీపావళి వచ్చేస్తోంది.. ఆ రోజు మీ రాశి ప్రకారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అదృష్టం ఉంటుంది!

దీపావళి వచ్చేస్తోంది.. ఆ రోజు మీ రాశి ప్రకారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అదృష్టం ఉంటుంది!

Peddinti Sravya HT Telugu

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి నాడు రాశుల ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది. దీపావళి దీపాల పండుగ. దీపావళి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే దీపావళి నాడు మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదం.

దీపావళి నాడు మీ రాశి ప్రకారం వీటిని కొనుగోలు చేస్తే మంచిది (pinterest)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. రాశుల ఆధారంగా ఒక వ్యక్తి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయన్నది కూడా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇక దీపావళి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి నాడు రాశుల ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది. దీపావళి దీపాల పండుగ.

ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే దీపావళి నాడు మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదం. మరి ఏ రాశి వారు ఎటువంటి వాటిని కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి నాడు మీ రాశి ప్రకారం వీటిని కొనుగోలు చేస్తే మంచిది

మేష రాశి:

మేష రాశి వారు దీపావళి నాడు వెండి లేదా వెండి నగలు లేదా వెండి పాత్రలు వెంటనే కొనుగోలు చేయడం మంచిది. కుదిరితే బంగారం, ఇత్తడి వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. మేష రాశి వారు వీటిని కొనుగోలు చేయడం వలన కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు, పురోగతి ఉంటుంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారు కూడా వెండి వస్తువులను కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ డబ్బులు ఉంటే వజ్రాలతో చేసిన ఆభరణాలను కూడా కొనుగోలు చేయొచ్చు.

మిధున రాశి:

మిధున రాశి వారు దీపావళికి కాంస్య పాత్రలు కొనుగోలు చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి, సంతోషంగా ఉండొచ్చు. కుదిరితే బంగారం కూడా కొనుగోలు చేసి, పచ్చరత్నం కొంటే కెరీర్‌లో పురోగతి ఉంటుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు వెండి లక్ష్మీ వినాయకుడిని, వెండి శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేస్తే మంచిది. లేదంటే వెండి ఆభరణాలు, ముత్యాల హారం, వెండి ఉంగరం వంటివి కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి.

సింహ రాశి:

ఈ రాశి వారు రూబీ రత్నాన్ని కొనుగోలు చేస్తే సానుకూల మార్పులను చూడొచ్చు. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండవు, సంతోషంగా ఉండొచ్చు, శుభ ఫలితాలు ఎదురవుతాయి.

కన్య రాశి:

కన్య రాశి వారు దీపావళి నాడు పూల కుండలను కొనుగోలు చేస్తే మంచిది. డబ్బులు ఉన్నవారు ముత్యాల హారాన్ని కొనుగోలు చేయొచ్చు.

తులా రాశి:

తులా రాశి వారు దీపావళి నాడు వెండి పాత్రలు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఇలా చేయడం వలన ఆదాయం కూడా పెరుగుతుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు రాగి పాత్రలు, వెండి లేదా వెండి ఆభరణాలను కొంటే మంచి ఫలితాలు చూస్తారు.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారు బంగారు ఆభరణాలు, ఇత్తడి పాత్రలు కొనుగోలు చేయడం మంచిది. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

మకర రాశి:

మకర రాశి వారు ఉక్కు పాత్రలు లేదా వాహనం కొనుగోలు చేస్తే మంచిది. ఏడాది పొడవునా పురోగతి ఉంటుంది.

కుంభ రాశి:

కుంభ రాశి వారు వాహనాలు, ఉక్కు పాత్రలను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలను చూస్తారు. వెండి, బంగారం కూడా కొనుగోలు చేయొచ్చు.

మీన రాశి:

మీన రాశి వారు బంగారం లేదా ఇత్తడి వస్తువులను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సకల సంతోషాలు కలుగుతాయి.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.