Leap day lucky zodiac signs: లీప్ డే రోజు అద్భుతమైన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టినట్టే-dhruva yoga form in leap day february 29th 2024 these zodiac signs get lucky ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Leap Day Lucky Zodiac Signs: లీప్ డే రోజు అద్భుతమైన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టినట్టే

Leap day lucky zodiac signs: లీప్ డే రోజు అద్భుతమైన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టినట్టే

Gunti Soundarya HT Telugu
Feb 29, 2024 01:35 PM IST

Leap day lucky zodiac signs: లీప్ డే కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈరోజు ఏర్పడిన అద్భుతమైన యోగం ఫలితంగా ఐదు రాశుల జాతకులు అన్నింటా విజయాలు సాధిస్తారు.

లీప్ డే రోజు అదృష్టం పొందిన రాశులు ఇవే
లీప్ డే రోజు అదృష్టం పొందిన రాశులు ఇవే (pixabay)

Leap day lucky zodiac signs: నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది లీఫ్ ఇయర్. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 29 రోజులు వచ్చాయి. ఈ లీఫ్ డే కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ధృవ యోగంతో సహా మంగళకరమైన యోగాల ఏర్పాటును సృష్టించింది. తుల, ధనుస్సు రాశి వారికి ఈరోజు సమృద్ధిగా ఆశీర్వాదాలను ఇస్తుంది. గురువారం బృహస్పతి, విష్ణువు కలిసి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని అందించబోతున్నారు. ధృవ యోగం ప్రభావంతో అదృష్టం పొందబోతున్న ఐదు రాశులు ఏవంటే..

వృషభం

వృషభ రాశి జాతకులకు ఫిబ్రవరి 29 శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారస్తులు విదేశీ సంస్థలతో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి. ధృవ యోగం, మంగళకరమైన శుభయోగాల ప్రభావంతో వ్యక్తిగతంగా, ఆర్థికపరంగా వృద్ధి సాధిస్తారు. వృషభ రాశి జాతకులు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఈరోజు మూంగ్ దాల్ పప్పు ఉడకబెట్టి వాటిలో నెయ్యి, పంచదార కలిపి ఆవుకి సమర్పించడం వల్ల ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి.

సింహ రాశి

సింహ రాశి జాతకులు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఈరోజు శుభ ప్రదంగా ఉంటుంది. ఇవాళ వ్యాపారం ప్రారంభిస్తే విజయం పథంతో దూసుకెళ్తారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబ బంధాలు బలపడతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం సింహ రాశి జాతకులు ఏడు పచ్చి యాలకులు, ఒక పిడికెడు పచ్చి మూంగ్ దాల్ పచ్చని గుడ్డలో కట్టి ఆలయం మెట్లపై ఉంచితే ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది.

తులా రాశి

విష్ణువు అనుగ్రహం తులా రాశి వారి మీద ఉంటుంది. ఫలితంగా ఈరోజు వారికి అద్భుతంగా గడుస్తుంది. సంపాదన పెరుగుతుంది. పొదుపు చేయగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవి ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ సంబంధాల్లో ఏవైనా ఒత్తిడిలో ఉంటే అవి శుభయోగాల సమయంలో సమసిపోయే అవకాశం ఉంది. ఈ రోజు ఈ పరిహారం పాటించడం వల్ల బృహస్పతి అనుగ్రహం కూడా లభిస్తుంది. కోరికలు నెరవేర్చుకోవడం కోసం గణేషుడికి పచ్చి శెనగల లడ్డూని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ జన్మచార్ట్ లోని బుధుడు స్థానం బలోపేతం అవుతుంది.

ధనస్సు రాశి

శుభయోగాల ప్రభావంతో ధనస్సు రాశి వాళ్ళు సానుకూల ప్రతిఫలాలు పొందుతారు. ఆర్థిక లాభాలు, వ్యక్తిగత, వృత్తి జీవితంలో సంతృప్తి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆకుపచ్చని రంగు బట్టలు ధరించాలి. అడ్డంకులు, వ్యాధుల నుండి ఉపశమనం కోసం ఆలయానికి లేదా ఎవరికైనా ఆకుపచ్చ వస్త్రాలు దానం చేయడం మంచిది.

మకర రాశి

వృద్ది యోగ ప్రభావంతో మకర రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. పవిత్రమైన యోగాల ప్రభావంతో జీవితంలోని అన్ని అంశాలు మెరుగుపడతాయి. ఆదాయం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యక్తిగత, వృత్తిపరంగా కూడా పురోగతి సాధిస్తారు. ఈరోజు గణేషుడికి సింధూరాన్ని సమర్పించండి. ఆర్థిక ఉపశమనం కోసం పారే నీటిలో మూంగ్ దాల్ వేయండి. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు, ఆనందం మీకు లభిస్తాయి

Whats_app_banner