అక్టోబర్ 18న ధన త్రయోదశి, ఆ రోజు ఈ 8 వస్తువులను ఇంటికి తీసుకు వస్తే సమస్యలన్నీ మాయం.. లక్ష్మీ అనుగ్రహంతో డబ్బు, ఐశ్వర్యం-dhanu trayodasi or dhanteras is on october 18th bring 8 things to home that day for lakshmi blessings wealth prosperity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్టోబర్ 18న ధన త్రయోదశి, ఆ రోజు ఈ 8 వస్తువులను ఇంటికి తీసుకు వస్తే సమస్యలన్నీ మాయం.. లక్ష్మీ అనుగ్రహంతో డబ్బు, ఐశ్వర్యం

అక్టోబర్ 18న ధన త్రయోదశి, ఆ రోజు ఈ 8 వస్తువులను ఇంటికి తీసుకు వస్తే సమస్యలన్నీ మాయం.. లక్ష్మీ అనుగ్రహంతో డబ్బు, ఐశ్వర్యం

Peddinti Sravya HT Telugu

ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ఆ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులను పొందవచ్చు. ధన త్రయోదశి నాడు వెండి, బంగారం, లోహపు వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిది. ధన త్రయోదశి నాడు వేటిని కొనుగోలు చేస్తే మంచిది, వేటి వలన ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ధన త్రయోదశి వేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి (pinterest)

ధన త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ప్రత్యేక మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అని మనం అంటాము. ఉత్తరాది వారు “ధన్తేరాస్ ”గా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ఆ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులను పొందవచ్చు. ధన త్రయోదశి నాడు వెండి, బంగారం, లోహపు వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిది. ఈ ఏడాది ధన త్రయోదశి నాడు వీటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.

ధన త్రయోదశి 2025

వీటిని కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదే విధంగా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. మరి ఇక ఈ ధన త్రయోదశి నాడు వేటిని కొనుగోలు చేస్తే మంచిది, వేటి వలన ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ధన త్రయోదశి వేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి.. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది

1. మట్టి ప్రమిదలు:

ఈ ఏడాది ధన త్రయోదశి నాడు మట్టి ప్రమిదలను కొనుగోలు చేయండి. ఇవి సంతోషాన్ని తీసుకొస్తాయి, బాధలను తొలగిస్తాయి.

2. వెండి:

వెండి ధనాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. ధన త్రయోదశి నాడు వెండిని కొనుగోలు చేయడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. అదే విధంగా ఆ వెండిని దీపావళి పూజ రోజు ఉపయోగించవచ్చు.

3. గోమతి చక్రాలు:

గోమతి చక్రాలు చక్రాకారంలో ఉంటాయి. గోమతి చక్రాలను కొనుగోలు చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి. కనీసం రెండు లేదా ఐదు గోమతి చక్రాలను ధన త్రయోదశి నాడు కొనుగోలు చేయండి. వీటిని ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే.

4. గవ్వలు:

లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ గవ్వలను ధన త్రయోదశి నాడు కొనుగోలు చేయడం చాలా మంచిది. వీటిని కొనుగోలు చేయడం వలన కష్టాలు తొలగిపోతాయి. ఈ గవ్వలను దీపావళి నాడు లక్ష్మీదేవికి సమర్పించండి. సకల సంతోషాలు కలుగుతాయి.

5. శంఖం:

లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖాన్ని కూడా ధన త్రయోదశి నాడు కొనుగోలు చేయండి. ధన త్రయోదశి నాడు శంఖాన్ని ఇంటికి తీసుకు రావడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. దీపావళి నాడు ఈ శంఖాన్ని ఉపయోగించవచ్చు.

6. లక్ష్మీ గణపతి ఫోటో:

వినాయకుడు, లక్ష్మీదేవి కలిపి ఉన్న విగ్రహం లేదా ఫోటోను కొనుగోలు చేయండి. దాంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంతోషాలు లభిస్తాయి.

7. చీపురు కట్ట:

ధన త్రయోదశి నాడు చీపురు కట్టను ఇంటికి తేవడం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది. దీనిని మీరు పూజ గదిలో పెట్టొచ్చు, దీపావళి నాడు కూడా పూజించొచ్చు.

8. పాత్రలు, దుస్తులు:

ధన త్రయోదశి నాడు దుస్తులు, పాత్రలు వంటివి కొనుగోలు చేస్తే కూడా మంచిదే. పసుపు, ఎరుపు, ఆరెంజ్ కలర్ దుస్తులు కొనుగోలు చేయడం శుభప్రదం. ఇలా పైన చెప్పిన వస్తువులను ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తే మీకు కష్టాలన్నీ తొలగిపోతాయి. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి, సంపద కలుగుతుంది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.