విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా
గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృ బాధలుండే అవకాశముంది.
15.5.25 నుంచి 19.10.25 వరకు, తిరిగి 6.12.25 నుండి సంవత్సరం వరకు గురుడు మిథునంలో రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఏర్పడతాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరము ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఋణ ప్రయత్నాలు చేస్తారు.
9.5.25 నుండి సంవత్సరం వరకు సింహంలో ఉంటాడు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
బృహస్పతి మే నుండి ఏడవ స్థానములో, శని నాలుగవ స్థానములో, రాహువు మే నుండి మూడవ స్థానములో, కేతువు మే నుండి తొమ్మిదవ స్థానములో సంచరించుట చేత ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు.
అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు, చికాకులు అధికమగును. అయినప్పటికి బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములో ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నువ్వులను దానం ఇవ్వండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి.
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. సంతానానికి కష్టములు. తల్లిదండ్రులకు అనారోగ్యము. ఇంట్లో సమస్యలు. ఏ పని తలపెట్టినా కలసిరాదు. స్నేహితుల సహకారం ఉంటుంది. ఉన్నత విద్యకు ఆటంకం ఉంటుంది. దంపతుల మధ్య విరోధాలు. అస్వస్థత, ఆందోళన.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రములు, వాహనములు కొనుగోలు చేస్తారు. భూ, గృహ సమస్యలు అనుకూలించును. అధికార లాభములు, దాన ధర్మములు చేయుదురు. మంచి గౌరవం. దూరప్రాంతపు వ్యాపారములు కలసివచ్చును.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. పనులలో ఆలస్యం జరుగును. మానసికాందోళన. ప్రయాణములలో సౌఖ్యము. భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగును. ప్రేమలో సఫలత. మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. ఇంట్లో శుభకార్యములు.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. కోర్టు వ్యవహారములలో జయము. భయాందోళనలుంటాయి. భూ, గృహ మార్పులు. మంచి గౌరవముంటుంది. చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు. పూజలు, వ్రతములు చేయుదురు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు పెరుగును. వ్యాపారపరంగా లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారెదరు. శరీరంలో అనుకోని మార్పులు, అనారోగ్యములు. రాజకీయ వ్యవహారములలో తిరుగుతారు. శుభకార్యాలు కలసివచ్చును.
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. అనుకోని ప్రయాణాలుంటాయి. పుత్రులతో గొడవలు. శరీరములో బద్ధకం, నీరసం, మందబుద్దిగా నడుచును. గృహం లేక భూమి కొనుట. సంతాన సౌఖ్యము. వ్యాపారస్తులకు లాభదాయకం. ధనలాభములు.
ఈ మాసం మీకు అనుకూల సమయం. ప్రతి పనిలో ఉత్సాహం. మానసిక ఆనందము. అలంకార ప్రాప్తి. ధనవ్యయం. కొత్తవారితో పరిచయాలుంటాయి. వ్యర్థపు ఆలోచనలు చేయుదురు. పెద్దలతో తిరుగుతారు. స్నేహితులతో మోసం జరుగును.
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. దేవాలయ దర్శనాలు. దాన ధర్మములు చేస్తారు. ఆదాయం బాగుండును. శతృ జయం. పెద్దవారితో గొడవలు, అధికార ఒత్తిడి. భార్యాభర్తల మధ్య ఎడబాటు. శుభకార్యాలు కలసివచ్చును. చేసే పనులలో చిక్కులు తీరును.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టం. మానసికాందోళన, భయం. సంఘంలో గౌరవం తగ్గును. విద్యపై ఆసక్తి. జ్ఞాపకశక్తి పెరుగును. ఖర్చులు అధికమగును. రుణబాధలు. మీ సంతానం మీద కోపంగా వ్యవహరించెదరు.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పని కలసివచ్చును. స్నేహితుల విందులలో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. అలంకార వస్తు లాభములుంటాయి. దూరప్రయాణాలు. స్త్రీ విరోధములు. అనుకోని ప్రయాణాలుంటాయి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. గౌరవం తగ్గును. అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు. మాట పట్టింపుల వల్ల ద్వేషం, కలహాలు. లాభాలు అంతగా కలసిరావు. ఆడంబరములకై ధనం ఖర్చు చేసెదరు. దుష్టుల సహవాసం.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబములో వృథా ఖర్చులుంటాయి. గృహ మార్పులు. దాన ధర్మాలు చేస్తారు. స్నేహబాంధవ్యాలు పెరుగను. స్త్రీ సహాయం. కుటుంబ కలహాలుంటాయి. ఆదాయం పెరుగును. కొన్ని విషయాలలో ఓటమి.
సంబంధిత కథనం