Dhanteras 2022 |ఇదే శుభ ముహూర్తం.. ధనత్రయోదశి నాడు ఇవి కొంటే ఆరోగ్యం, ఐశ్వర్యం!-dhanteras 2022 know shubh muhurat puja vidhi what to buy on auspicious dhanatrayodashi day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Dhanteras 2022, Know Shubh Muhurat, Puja Vidhi, What To Buy On Auspicious Dhanatrayodashi Day

Dhanteras 2022 |ఇదే శుభ ముహూర్తం.. ధనత్రయోదశి నాడు ఇవి కొంటే ఆరోగ్యం, ఐశ్వర్యం!

HT Telugu Desk HT Telugu
Oct 23, 2022 01:48 PM IST

Dhanteras 2022: ధంతేరస్‌ను ధనత్రయోదశి అని కూడా అంటారు. ఈ ఏడాది ఈ పర్వదినాన్ని అక్టోబర్ 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు జరుపుకుంటున్నారు. ఈరోజు శుభముహూర్తం ఏంటి?చీపురు కట్ట మొదలు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తారో తెలుసుకోండి.

Dhanteras 2022
Dhanteras 2022

Dhanteras 2022: దీపావళి పండుగ ధంతేరస్‌తో ప్రారంభమవుతుంది. ధంతేరస్‌ని ధనత్రయోదశి అని కూడా అంటారు. ఈరోజున లక్ష్మీదేవీని, సంపదలకు దేవుడైన కుబేరుడిని అలాగే ఆయురారోగ్య ప్రదాత ధన్వంతరిని పూజిస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ధనత్రయోదశి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ధనత్రయోదశి రోజున ప్రజలు బంగారం, వెండి సహా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇలాంటి వస్తువులను కొనుగోలు చేసి, వాటిని ఇంటికి తీసుకురావడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, కుబేరుడి ఆశీర్వాదాలతో ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని, అలాగే ఆయురాయోగ్యాలతో వర్ధిల్లుతారని నమ్ముతారు.

మీరూ అక్టోబర్ 23న అంటే ఈరోజు ధనత్రయోదశి పర్వదినం జరుపుకుంటున్నట్లయితే.. ఈరోజు శుభముహూర్తం, పూజా విధానం, కనుగోలు చేయాల్సిన వస్తువులను తెలుసుకోండి.

Dhanteras Muhurat- ధనత్రయోదశి శుభముహూర్తం

సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమయ్యే ప్రదోష కాలంలో ధనత్రయోదశి ఘడియలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో లక్ష్మీ పూజ శుభప్రదంగా చెబుతారు. అక్టోబరు 23న సాయంత్రం 05:44 నుండి 06:05 వరకు ధనత్రయోదశి ఆరాధనకు అనుకూలమైన సమయం. పూజ వ్యవధి 21 నిమిషాలు.

ధనత్రయోదశి ప్రదోషకాలం సాయంత్రం 05:44 నుండి రాత్రి 08:16 వరకు ఉంటుంది. వృషభ కాలం సాయంత్రం 06:58 నుండి రాత్రి 08:54 వరకు ఉంటుంది.

బంగారం, వెండి వస్తువులు: ధన్‌తేరస్‌లో బంగారం, వెండిని కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా చెప్తారు. ఈ రోజున చాలా మంది ధనంతో పాటు లక్ష్మీ దేవీ ప్రతిరూపంగా నాణేలను పూజిస్తారు.

ధనత్రయోదశి నాడు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే శుభకరం

బంగారం, వెండి వస్తువులు: ధన్‌తేరస్‌లో బంగారం, వెండిని కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా చెప్తారు. ఈ రోజున చాలా మంది ధనంతో పాటు లక్ష్మీ దేవీ ప్రతిరూపంగా నాణేలను పూజిస్తారు.

చీపురు: ధంతేరస్ రోజున చీపురు కొనడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.

వాహనం: ఈ రోజున ఏదైనా వాహనం కొనుగోలు చేయడం శుభప్రదమని చెబుతారు.

లక్ష్మీ, వినాయక విగ్రహాలు: పురాణ విశ్వాసాల మేరకు, ధనత్రయోదశి రోజున లక్ష్మీ దేవీ, వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడం శుభప్రదం.

రాగి, ఇత్తడి పాత్రలు: పౌరాణిక గాథల ప్రకారం, క్షీరసాగర మథనం సమయంలో ధన్వంతరి ప్రత్యక్షమైనపుడు, ఆయన చేతిలో ఒక ఇత్తడి కలశం ఉంది, అది అమృతంతో నిండి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజున రాగి, ఇత్తడి పాత్రలు కొనుగోలు వేస్తే ఆరోగ్య వృద్ధి ఉంటుందని నమ్మకం.

ధనత్రయోదశి పూజా విధానం:

  • ముందుగా పూజ చేసే స్థలాన్ని గంగాజలంతో శుభ్రపరచండి.
  • ఆపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి.
  • ఎరుపు రంగు వస్త్రంపై ధన్వంతరి, మహాలక్ష్మీ అలాగే కుబేరుడి విగ్రహాలు ప్రతిష్టించండి.
  • భగవంతుని ముందు స్వచ్ఛమైన నెయ్యితో దీపం, ధూపం , అగరబత్తులను వెలిగించండి.
  • దేవతలకు ఎర్రని పుష్పాలను సమర్పించండి.
  • మీరు ఈ రోజున కొనుగోలు చేసిన బంగారు, వెండి ఆభరణాలు లేదా లోహపు వస్తువులు భగవంతుని ముందు ఉంచండి.
  • లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ చాలీసా, లక్ష్మీ యంత్రం, కుబేర యంత్రం, కుబేర స్తోత్రాలను పఠించండి.
  • భగవంతునికి మధురమైన, తియ్యని ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించండి.

మీకు, మీ కుటుంబ సభ్యులకు ధనత్రయోదశి, దీపావళి శుభాకాంక్షలు.

WhatsApp channel

సంబంధిత కథనం