మరి కొన్ని రోజుల్లో ధన త్రయోదశి, ఆ రోజు బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చెయ్యాలి? అలా కుదరకపోతే ఏం చెయ్యచ్చో తెలుసుకోండి-dhana trayodashi or dhanteras 2025 why should we buy gold or silver on that day check what can we buy if not these ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మరి కొన్ని రోజుల్లో ధన త్రయోదశి, ఆ రోజు బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చెయ్యాలి? అలా కుదరకపోతే ఏం చెయ్యచ్చో తెలుసుకోండి

మరి కొన్ని రోజుల్లో ధన త్రయోదశి, ఆ రోజు బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చెయ్యాలి? అలా కుదరకపోతే ఏం చెయ్యచ్చో తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి రోజున ధన త్రయోదశిని జరుపుకుంటాము. ఉత్తరాది వారు దీనిని దంతేరస్ గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ఆ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులను పొందాలని చాలా మంది రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు.

ధన త్రయోదశికి వీటిని కొంటే కూడా మంచిదే (pinterest)

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి ముందు ధన త్రయోదశి వస్తుంది. పంచాంగం ప్రకారం కొన్ని తిధులకు ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ధన త్రయోదశి కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆయుర్వేదానికి మూలపురుషుడైన ధన్వంతుడు భూమి మీద ఉద్భవించిన రోజు ధన త్రయోదశి. అలాగే చాలా మంది ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎ

ఈ సంవత్సరం ధన త్రయోదశి ఎప్పుడు వచ్చింది?

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి రోజున ధన త్రయోదశిని జరుపుకుంటాము. ఉత్తరాది వారు దీనిని దంతేరస్ గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ఆ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులను పొందాలని చాలా మంది రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ధన త్రయోదశి నాడు వెండి, బంగారం లాంటి లోహపు వస్తువులను కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు.

బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చెయ్యాలి?

బంగారం, వెండి కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు కలుగుతాయని నమ్ముతారు. దీపావళి పండుగ కూడా ఆ రోజు నుంచి మొదలవుతుంది. బంగారం, వెండి కొనలేకపోతే కొత్త వస్తువులు ఏవైనా కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుందని, అదృష్టం కూడా ఎక్కువ అవుతుందని విశ్వసిస్తారు.

ధన త్రయోదశి నాడు తక్కువ ధరకే వచ్చే ఈ వస్తువులను కూడా కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. కచ్చితంగా బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. చాలా మందికి ఎంతో కష్టంతో కూడుకున్నది. అలా కొనలేని వారు ఇత్తడి, రాగి పాత్రలను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అదృష్టం కూడా పెరుగుతుంది.

ధన త్రయోదశికి వీటిని కొంటే కూడా మంచిదే

1.చీపురు కట్ట:

ధన త్రయోదశి నాడు చీపురు కట్ట కొనుగోలు చేస్తే కూడా మంచి ఫలితాలు ఎదురవుతాయి. ఆ రోజున చీపురు కొనుకుని వాడకుండా ఎప్పుడూ దాచిపెట్టాలి. శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. అలా చేస్తే పేదరికం తొలగిపోతుంది.

2.గోమతి చక్రం:

లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గోమతి చక్రాలను ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. గోమతి చక్రాలను ఇంటి పూజ గదిలో పెట్టి ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. డబ్బు కొరత తొలగిపోతుంది. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

3.ఉప్పు:

ధన త్రయోదశి నాడు ఉప్పును కొనుగోలు చేస్తే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఆనందం, శ్రేయస్సును ఉప్పు తీసుకువస్తుందని నమ్ముతారు.

ఈ చిన్న పరిహారాన్ని కూడా పాటించవచ్చు:

11 గోమతి చక్రాలను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇంట్లో ఒక చోట ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే పసుపు కూడా లక్ష్మీదేవికి ఇష్టం. వాటిని ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.