Telugu News  /  Rasi Phalalu  /  Devi Navaratri Tenth Day Is Sri Raja Rajeshwari Devi Darshanam On Vijaya Dashami 2022
శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం
శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం

Dashami 2022 : దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం

05 October 2022, 4:30 ISTGeddam Vijaya Madhuri
05 October 2022, 4:30 IST

Navaratri 10th Day Sri Raja Rajeshwari Devi Darshanam : నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారు పదోవ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో 10వ రోజే ఆఖరి రోజు. దీనినే విజయదశమిగా చేసుకుంటామని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Navaratri 10th Day Sri Raja Rajeshwari Devi Darshanam : దేవీ నవరాత్రులలో పదవ అవతారం ఆఖరి రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు విజయదశమిగా చేసుకుంటాం. ఈరోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా పూజించాలి. అమ్మవారిని గులాబీరంగు వస్త్రముతో అలంకరించాలి. అమ్మవారికి ఈరోజు మహా నైవేద్యముతో నివేదన చేయాలి. పులిహోర, గారెలు, క్షీరాన్నం, దక్షోజనంతో అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి.

ట్రెండింగ్ వార్తలు

అంతేకాకుండా మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రము నుంచి అమృతభాండము బయటపడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెప్తారు. త్రేతా యుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజునే విజయదశమి రోజుగా సెలబ్రేట్ చేసుకుంటాము. ద్వాపర యుగంలో శమీ వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తరువాత ఆ శమీ వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకుని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు విజయదశమి రోజు.

ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి విజయములు కలుగుతాయని దేవీ పురాణం తెలియచేస్తుంది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. ఈ రోజు అమ్మవారిని పూజించి ముహూర్తంతో పని లేకుండా ఏ పని ప్రారంభించినా విజయము పొందుతారని జ్యోతిష్యశాస్త్రం తెలియచేస్తుంది.

సనాతన ధర్మంలో దైవారాధనలు మూడు రకములుగా ఉన్నాయి. అవి ఏంటంటే..

1. శివారాధన

2. విష్ణు ఆరాధన

3. శక్తి ఆరాధన.

శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మీ, దుర్గాదేవి ఆరాధన. శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. విజయవాడ కనకదుర్గమ్మ అలంకరాల ప్రకారం నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారం. దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారి అలంకరణలు ఉంటాయి. ఆరవ రోజు అంటే నిన్న అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

దేవీ భాగవతం ప్రకారం..

పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం, యోగనిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు. అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని అడిగారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరుతారు.

అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాలలో సంహరించు సమయంలో.. మహామాయ పదితలలతో, పది కాళ్లతో, నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది. ఈ విధముగా మహా మాయ అయిన అమ్మవారు.. మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు. కంస సంహారమునకు సహాయపడుటకై నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడ్డారు అమ్మవారు. సింహవాహినిగా మహిసాసురుని సరస్వతీ రూపిణిగా సుబ, నుసుంబులను ఛండ ముండులను సంహరించిన ఛాముండి, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరి, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెప్తారు.

టాపిక్