August horoscope: ఆగస్ట్ నెల ఈ రాశుల వారికి కష్టాలను ఇవ్వబోతుంది.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు-dangerous combination of saturn sun in august these 4 zodiac signs get troubles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  August Horoscope: ఆగస్ట్ నెల ఈ రాశుల వారికి కష్టాలను ఇవ్వబోతుంది.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు

August horoscope: ఆగస్ట్ నెల ఈ రాశుల వారికి కష్టాలను ఇవ్వబోతుంది.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు

Gunti Soundarya HT Telugu
Jul 25, 2024 03:43 PM IST

August horoscope: ఆగస్ట్‌లో శని సూర్యుడితో ప్రమాదకరమైన యోగాన్ని, అలాగే శుభకరమైన మరొక యోగాన్ని ఏర్పరుస్తారు. ఈ యోగ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆగస్ట్‌లో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

ఆగస్ట్ నెల ఈ రాశుల వారికి కష్టాలు
ఆగస్ట్ నెల ఈ రాశుల వారికి కష్టాలు

August horoscope: గ్రహాల సంచారం, రాశుల పరంగా ఆగస్ట్ నెల చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అనేక పెద్ద గ్రహాలు ఆగస్ట్ నెలలో రాశులను మార్చుకుంటూ శుభ, అశుభ యోగాలని సృష్టిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రెండు యోగాలు.

సంబంధిత ఫోటోలు

సూర్యుడు శని కలిసి ఒక శుభ యోగం, మరొక అశుభ యోగాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. సూర్యుడు, శని కర్కాటక రాశి ఆరు, ఎనిమిదో ఇంట్లో ఉన్నారు. దీని వల్ల అశుభకరమైన షడష్టక యోగం ఏర్పడింది. దీని ప్రభావం ఆగస్ట్ 15 వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది ప్రమాదకరమైనది.

సూర్యుడు ఆగస్ట్ 16 నుంచి సింహ రాశిలో సంచరిస్తాడు. అప్పుడు ఏడో ఇంట్లో సూర్యుడు, శని ముఖాముఖిగా ఉంటాయి. ఈ సమయంలో శుభకరమైన సంసప్తక యోగం ఏర్పడబోతుంది. వీటితో పాటు ఆగస్ట్ గ్రహాల సంచార ప్రభావం కూడా ఉంటుంది.

ఆగస్ట్ 5 నుంచి బుధుడు సింహ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తాడు. ఆగస్ట్ 26న కుజుడు మిథున రాశిలో సంచరిస్తాడు. ఆగస్ట్ 28న కర్కాటక రాశిలో బుధుడు ప్రత్యక్షంగా ఉంటాడు. ఆగస్టు 24న శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఆగస్ట్ నెలలో కొన్ని రాశులవారిపై గ్రహాల గమనం అశుభ ప్రభావాలను చూపుతుంది. ఆగస్ట్‌లో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

మేష రాశి

మేష రాశి వారికి ఆగస్ట్ నెల బాధాకరంగా ఉంటుంది. ఈ నెల మీరు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఆగస్ట్ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మితిమీరిన ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో చిక్కులు ఏర్పడతాయి. ఈ నెలలో రుణాలు ఇవ్వడం మానుకోండి, లేకపోతే డబ్బు నిలిచిపోవచ్చు.

మకర రాశి

మకర రాశి వారికి ఆగస్ట్ నెల ఎటువంటి విశేష ఫలితాలను ఇవ్వదు. నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. కార్యాలయంలో పనిభారం ఉంటుంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది.

మీన రాశి

మీన రాశి వారు ఆగస్ట్ లో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సమయంలో మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు కార్యాలయంలో రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. పనిలో నిరాశ ఉండవచ్చు. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner