మే 8, నేటి రాశి ఫలాలు.. కీలకమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలతో కష్టాలు తప్పవు-daily horoscope may 8th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 8, నేటి రాశి ఫలాలు.. కీలకమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలతో కష్టాలు తప్పవు

మే 8, నేటి రాశి ఫలాలు.. కీలకమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలతో కష్టాలు తప్పవు

HT Telugu Desk HT Telugu
May 08, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ08.05.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 8 వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 8 వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 08.05.2024

yearly horoscope entry point

వారం: బుధవారం, తిథి : అమావాస్య,

నక్షత్రం : భరణి, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. కుటుంబ వ్యవహారంలో మొహమాటం ఒత్తిళ్ళకు తావివ్వకండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. స్వీట్స్‌, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆకస్మిక సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. స్త్రీలు రచనలు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. లౌక్యంగా మెలిగి పనులు చక్కబెట్టుకుంటారు. మార్కెట్‌ రంగాల వారికి ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు ఏజెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరగలదు. ఉద్యోగస్తులకు అధికారులకు కానుకలు అందజేస్తారు. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను గుర్తిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. దూరప్రయాణాలలో అనుకూలత కొత్త అనుభూతికి లోనవుతారు. దుబారా ఖర్చులు అదుపు చేయగల్లుతారు. ఉద్యోగస్తులు సమావేశాలు, విందులలో పాల్గొంటారు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులెదురైనా రావలసిన ధనం అందటంతో కుదుటపడతారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. విద్యార్థులలో పలు అలోచనలు చోటు చేసుకుంటాయి. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉమ్మిడి వ్యాపారాలు, జాయింట్‌ వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయజాలవు. మొండిబాకీలు వసూలు కాగలవు. మీ ప్రమేయంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. కష్టసమయంలో అయిన వారికి అండగా ఉంటారు. మీ శ్రీమతి వైఖరి మరింత చికాకుపరుస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పత్రికా, పారిశ్రామిక సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల ఆకస్మిక రాక వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అరియర్స్‌ మంజూరవుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చికరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థిక విషయాల్లో సంతృప్తికానరాదు. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఆత్మీయులతో కలసి విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. స్త్రీలకు బరువు, బాధ్యతలకు అధికమవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసివస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రధాన కంపెనీల షేర్ల విలువలు తగ్గే సూచనలున్నాయి. వస్త్ర వ్యాపారులు పనివారాలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అయినవారే సాయం చేసేందుకు సందేహిస్తారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వైద్య, ఇంజనీరింగ్‌ రంగంలో వారికి మెళకువ అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ద వహించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితంగా ఉండాలి. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు. పనులు అనుకున్న విధంగా సాగవు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు మీ స్తోమతకు తగినట్టే ఉంటాయి. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కీలకమైన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner