జూన్ 30, నేటి రాశి ఫలాలు.. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు, అరుదైన ఆహ్వానాలు-daily horoscope june 30th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 30, నేటి రాశి ఫలాలు.. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు, అరుదైన ఆహ్వానాలు

జూన్ 30, నేటి రాశి ఫలాలు.. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు, అరుదైన ఆహ్వానాలు

HT Telugu Desk HT Telugu
Jun 30, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ30.06.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 30వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 30వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 30.06.2024

వారం: ఆదివారం, తిథి : న‌వమి,

నక్షత్రం: రేవ‌తి, మాసం : జ్యేష్టము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం

మేషం

మేష‌ రాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభ సూచనలు. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థులకు అనుకూలత. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు గుర్తింపు. దేవీ ఖడ్గమాల పఠించండి.

వృషభం

వృష‌భ రాశివారికి గ‌తంతో పోలిస్తే గ్ర‌హ‌స్ధితి కాస్త‌ మెరుగ్గానే ఉంది. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగల‌దు. కళాకారులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. శివాష్టకం పఠించండి.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు రాబడి పెరుగుతుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. అరుదైన ఆహ్వానాలు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం

కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఒకింత క‌లిసి వ‌చ్చేకాలం. ప‌నిభారం కాస్త త‌క్కువ‌గా ఉంటుంది. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

సింహం

సింహ రాశి వారికి గ్ర‌హ‌స్థితి కాస్త మంద‌కొండిగా సాగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగానే సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య

సంతృప్తిక‌ర ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. రావాల్సిన డ‌బ్బు స‌మ‌యానికి అందుతుంది. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఉపశమనం. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. విష్ణు సహస్రనామాల‌ను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పారాయణం చేయండి.

తుల

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. ఆంజనేయ దండకాన్నిపఠించండి.

వృశ్చికం

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. తప్పనిసరి ప‌రిస్థితుల్లో కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నత్త నడకని సాగుతూ స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులు అదనపు పనిభారంతో సతమతమవుతారు. గణ‌ప‌తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. శుభకార్యాలు, దైవకార్యాల నిర్వహణపై చర్చలు ఫలిస్తాయి. కొత్త గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

మకరం

మీలోని పట్టుదల, ఆత్మస్థైర్యమే మిమ్మ‌ల్ని విజయాల వైపు నడిపిస్తాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు మీద పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. విష్ణుధ్యానం చేయండి.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు అనుకున్న స‌మ‌యానికి ఆదాయం సమకూరుతుంది. శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతనోత్సాహం. అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. గణేశాష్టకం పఠించండి.

మీనం

ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. అయితే అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. బంధువుల సలహాలు, సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel