ఏప్రిల్ 19, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు-daily horoscope in telugu april 19th 2024 today rasi phalalu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 19, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు

ఏప్రిల్ 19, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు

HT Telugu Desk HT Telugu
Apr 19, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ19.04.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 19వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 19వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 19.04 2024

వారం: శుక్రవారం, తిథి : శు. ఏకాదశి,

నక్షత్రం : మఘ, మాసం : చైత్రము

సంవత్సరం: శ్రీ కోధి నామ, అయనం : ఉత్తరాయణం

మేష రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి సహాయం చేసేవారుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్ధులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో పురోగతి లభిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. ఆదాయం కలసివస్తుంది. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు వృత్తి వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. రాజకీయాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికంగా ఉన్నప్పటికి విజయవంతంగా రాణిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. వృషభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఓ శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుంది. రాజకీయ రంగాల వారికి మంచి సమయం. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహకారం అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటారు. ఆరోగ్యం అనుకూలించును. విష్ణు సహస్రనామం పఠించాలి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సామాజిక రంగాల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు వెళతారు. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అనుకోకుండా ధన వ్యయం కలిగి అవకాశాలున్నాయి. ఉద్యోగాల కోసం విదేశాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొందరి స్నేహితుల కారణంగా కొంత డబ్బు నష్టపోయే ప్రమాదముంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని బాధపెట్టే అవకాశాలుంటాయి. ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధువులతో అభిప్రాయభేదాలు ఏర్పడు సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా మాట్లాడే ముందు అలోచించి మాట్లాడటం మంచిది. కొన్ని సందర్భాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విరోధులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పెళ్ళి ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలున్నాయి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్షీ అష్టకం పఠించండి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చికరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులతో మాట్లాడేముందు అచితూచి వ్యవహరించాలి. మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశముంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి. చేపట్టిన పనులలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల సమయం. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల మాట వినటం వల్ల మంచి జరుగుతుంది. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించాలి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వివాహ ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా, ఆనందముగా గడిపెదరు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలించును. దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ పిల్లలతో ఆనందముగా గడుపుతారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాలలో పెద్దల సహకారం తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు అధికంగా శ్రమపడాల్సి వస్తుంది. అధికారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఒక శుభవార్త మిమ్మల్ని ఎంతోగానో ఉత్సాహపరుస్తుంది. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశముంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవడం మంచిది. మీన రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel