ఏప్రిల్ 18, నేటి రాశి ఫలాలు.. సమాజంలో గౌరవం దెబ్బతింటుంది, అనుకోని ఖర్చులు-daily horoscope in telugu april 18th 2024 today rasi phalalu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 18, నేటి రాశి ఫలాలు.. సమాజంలో గౌరవం దెబ్బతింటుంది, అనుకోని ఖర్చులు

ఏప్రిల్ 18, నేటి రాశి ఫలాలు.. సమాజంలో గౌరవం దెబ్బతింటుంది, అనుకోని ఖర్చులు

HT Telugu Desk HT Telugu
Apr 18, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ18.04.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 18, నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 18, నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 18.04 2024

వారం: గురువారం, తిథి : శు.దశమి,

నక్షత్రం : ఆశ్లేష, మాసం : చైత్రము

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలయందు పని ఒత్తిళ్ళు అధికమగును. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబమునందు తొందరపాటు నిర్ణయాల వలన మానసిక అందోళన చెందుతారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. వృత్తి వ్యాపారపరంగా సత్ఫలితాలున్నాయి. చిన్నపాటి సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. వ్యాపారస్తులకు భాగస్వాములు కలసివస్తారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్జి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంనందు గౌరవ మర్యాదలు పొందుతారు. ఇతరులకు మీవంతు సహాయ సహకారాలు చేస్తారు. కుటుంబమునందు సంతోషకరమైన వాతావరణం. వృత్తి, వ్యాపారములు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలసి ఆనందముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పై అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో కలసి ఆనందముగా గడిపెదరు. సమాజము నందు కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం. రావలసిన పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారపరంగా అనుకూల సమయం. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామ నామ స్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంనందు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారంమందు ధనలాభము కలుగును . బంధువర్గంతో సహాయ సహకారాలు పొందగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సింహ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సమాజము నందు గౌరవ మర్యాదలు నశిస్తాయి. మానసిక ఆందోళనకు గురవుతారు. బంధుమిత్రులతో విరోధాలుంటాయి. ఉద్యోగంనందు అధికారుల వలన సమస్యలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేరు. అనవసరమైన గొడవలు, వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి చిన్న విషయంలో భయపడతారు. చేయు పని యందు అలసట , పని ఒత్తిళ్ళు అధికమగును. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారపరంగా ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగమునందు పై అధికారులచే ఒత్తిళ్ళు ఏర్పడును. పిల్లల పట్ల శ్రద్ద వహించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆకారణంగా గొడవలు ఏర్పడవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. మానసిక అందోళన. ప్రయత్నించిన పనులు వృథా అగును. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం నందు అధిక శ్రమ ఏర్పడుతుంది. ప్రతి పని పట్టుదలతో ధైర్యంగా చేస్తారు. ఉద్యోగమునందు అనుకోని ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు చేయవలసి వుంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందక ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలుంటాయి. రాజకీయ వ్యవహారములు అనుకూలించును. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. బంధుమిత్రులతో అకారణంగా గొడవలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు కలిగించును. దుష్ట సహవాసాలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాగలవు. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన నిర్ణయాలకు కుటుంబ సభ్యులతో కలసి తీసుకొనవలెను. వ్యాపారం నందు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదములు ఏర్పడును. అరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చెడు సహవాసాల వల్ల కష్టనష్టాలు ఏర్పడతాయి. తలచిన పనులు సరైన ఆలోచన అవగాహన లేకపోవడం వలన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఊహించని రీతిలో ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ఇతరుల సేవలకు మీవంతు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి విషయం జాగ్రత్తగా ఒక క్రమపద్ధతిలో చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. దూర ప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలం. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలుంటాయి. వృత్తి వ్యాపారములు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో చిన్నసాటి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. సమాజము నందు మీ ప్రతిభకు తగిన గౌరవం లభించు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel