ఆగస్ట్ 29 నేటి రాశి ఫలాలు- ఈ రాశుల వారికి భారీ ధనలాభం ఉంది, సమస్యలు తొలగిపోతాయి-daily horoscope for telugu 29th august 2024 check zodiac wise predictions in today rasi phalalu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆగస్ట్ 29 నేటి రాశి ఫలాలు- ఈ రాశుల వారికి భారీ ధనలాభం ఉంది, సమస్యలు తొలగిపోతాయి

ఆగస్ట్ 29 నేటి రాశి ఫలాలు- ఈ రాశుల వారికి భారీ ధనలాభం ఉంది, సమస్యలు తొలగిపోతాయి

HT Telugu Desk HT Telugu
Aug 29, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ29.08.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆగస్ట్ 29 నేటి రాశి ఫలాలు
ఆగస్ట్ 29 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 29.08.2024

వారం: గురువారం, తిథి : ఏకాద‌శి,

నక్షత్రం: ఆరుద్ర, మాసం: శ్రావ‌ణ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. అదృష్టయోగం సూచితం. కీలక సమయాల్లో ధర్మ బద్ధమైన నిర్ణయాలు తీసుకోండి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శత్రు విమోచనం కలుగుతుంది. ధనధాన్య వృద్ధి ఉంది. శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.

వృషభం

ధనలాభం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. మిత్రుల సహాయసహకారాలు అందుతాయి. ఉద్యోగులకు ఆత్మవిశ్వాసం అవసరం. అధికారుల అండ లభిస్తుంది. ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయకండి. కుటుంబ సభ్యుల సలహాలను విస్మరించకండి. గతంలోని పెట్టుబడులు గణనీయమైన వృద్ధిని సాధిస్తాయి. శివారాధన శుభప్రదం.

మిథునం

ఉద్యోగంలో మేలు జరుగుతుంది. విజయాలు సొంతం అవుతాయి. గతంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. ధనధాన్య యోగాలున్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారంలో కొద్దిపాటి ఆటంకాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఒత్తిడి వద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి.

కర్కాటకం

అన్నివిధాలా అనుకూలమైన సమయం. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసిద్ధి ఉంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. గృహ, వాహన యోగాలున్నాయి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఎంతో కాలంగా మూలనపడిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓ శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.

సింహం

ధనలాభం సూచితం. కీలక నిర్ణయాల విషయంలో వెనకడుగు వేయకండి. మనోబలం ముఖ్యం. ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా సంయమనం కోల్పోవద్దు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. పనులు వాయిదా వేయకండి. కొన్ని శక్తులు ఆటంకాలు సృష్టిస్తాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కన్య

నేటి రాశి ఫలాల ప్రకారం ఏకాగ్రతతో పనిచేయండి. మనోబలం అవసరం. నకారాత్మక ఆలోచనలు వద్దు. చంచలమైన నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల భాగస్వామ్యంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ప్రశాంత చిత్తంతో వాటికి పరిష్కారం వెతకండి. సూర్యభగవానుడిని ధ్యానించండి.

తుల

ఉద్యోగ విజయాలు సాధిస్తారు. అధికార బలం పెరుగుతుంది. మీవల్ల నలుగురూ బాగుపడతారు. భూ, గృహ యోగాలున్నాయి. ధనలాభం గోచరిస్తోంది. వ్యాపారంలో ఎదుగుదల సాధిస్తారు. పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకుంటూ శాంతంగా సంభాషించండి. మీ వల్ల కుటుంబానికి మేలు జరుగుతుంది. దుర్గామాతను ధ్యానించండి.

వృశ్చికం

ఉద్యోగ ఫలితాలు బావుంటాయి. ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. మనోభీష్టం సిద్ధిస్తుంది. అధికార యోగం ఉంది. నలుగురితో కలుపుగోలుగా ఉండండి. నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి.

ధనుస్సు

ముఖ్యకార్యాల్లో విజయం సాధిస్తారు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. అవరోధాలు ఎదురైనా ధర్మమార్గంలో ప్రయాణించండి. అంతిమ విజయం మీదే. ఆస్తులు వృద్ధి చెందుతాయి. స్వగృహ నిర్మాణం చేపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటం వద్దు. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయినా నిరాశవద్దు. కులదైవాన్ని ప్రార్థించండి.

మకరం

ధనయోగం ఉంది. ఆర్థిక పురోగతి గోచరిస్తోంది. గృహ, వాహన యోగాలున్నాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. శీఘ్రమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. అధికారులు ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా సంభాషించండి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. సూర్యనారాయణుడిని ఆరాధించండి.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. కీలక నిర్ణయాల విషయంలో పునరాలోచన మంచిది. ఆటంకాలు ఎదురైనా ఉత్సాహం కోల్పోవద్దు. సంయమనం ముఖ్యం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అవరోధాలను అధిగమిస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. వృథా వ్యయాలను తగ్గించుకోండి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

మీనం

అదృష్టయోగం సూచితం. మీదైన రంగంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో సవాళ్లను అధిగమిస్తారు. మీ నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కొన్ని విషయాల్లో గందరగోళం నుంచి బయటపడతారు. పొదుపు అవసరం. మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ