Cremation: దహనం చేసిన తరవాత ఈ శరీర భాగం కాలిపోకుండా ఉంటుందని తెలుసా? ఆ తరవాత ఏం చేస్తారంటే?
Cremation: భగవద్గీత ప్రకారం, ఈ లోకంలో ఎవరు జన్మించినా ఏదో ఒక రోజు చనిపోవాలి. ఈ నిజం తెలిసిన తర్వాత కూడా ఆత్మీయుల మరణ వేదన అందరినీ కంట తడి పెట్టిస్తూ ఉంటుంది. అయితే, సనాతన ధర్మంలో మరణం తర్వాత మృతదేహాన్ని కర్మలతో దహనం చేస్తారు. దహన సంస్కారాలు చేసిన తర్వాత కూడా కాలిపోని శరీర భాగం ఉందని మీకు తెలుసా?
పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మరణం అనేది జీవితానికి సంబంధించిన కఠినమైన నిజం. దానిని ఎవరు కూడా మార్చలేరు. భగవద్గీత ప్రకారం, ఈ లోకంలో ఎవరు జన్మించినా ఏదో ఒక రోజు చనిపోవాలి. ఈ నిజం తెలిసిన తర్వాత కూడా ఆత్మీయుల మరణ వేదన అందరినీ కంట తడి పెట్టిస్తూ ఉంటుంది. అయితే, సనాతన ధర్మంలో మరణం తర్వాత మృతదేహాన్ని కర్మలతో దహనం చేస్తారు.

దానిని అగ్నికి అప్పగిస్తారు. కొంచెం సమయం తర్వాత శరీరం కాలిపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. దహన సంస్కారాలు చేసిన తర్వాత కూడా కాలిపోని శరీర భాగం ఉందని మీకు తెలుసా? ఏంటి దహనం చేసిన తర్వాత కూడా, ఒక శరీర భాగం కాలిపోకుండా అలా ఉండిపోతుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఆ విషయమే ఇప్పుడు తెలుసుకుందాం.
దహనం చేసిన తర్వాత ఈ శరీర భాగం కాలిపోదా?
- పండితులు చెప్పిన దాని ప్రకారం, అంత్యక్రియల సమయంలో చితిపై మృతదేహాన్ని పెట్టినప్పుడు, కొన్ని గంటల్లో ఎముకలతో పాటుగా మొత్తం శరీరం కాలిపోతుంది.
- అయితే, ఈ సమయంలో ఒక భాగం కాలిపోదు. ఈ భాగం మానవ దంతాలు. ఫాస్ఫేట్, కాల్షియంతో తయారుచేయబడతాయి. ఇది చాలా ఘనమైనదిగా పరిగణించబడుతుంది. అగ్ని కూడా కాల్చలేదు.
- దహనం చేసిన తర్వాత కూడా దంతాలు సాధారణంగా కాలిపోకుండా ఉండడానికి కారణం ఇదే. మిగిలిన శరీరం అంతా కూడా బూడిద అయిపోతుంది.
సైంటిస్టులు ఏం చెప్తున్నారు?
- సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే, దహన సమయంలో ఎక్కువ వేడి సుమారు 1229 డిగ్రీల ఫారిన్హీట్ ఉత్పత్తి అవుతుంది. చర్మం, నరాలు, ఎముకలు కాలిపోతాయి.
- ఈ భయంకరమైన మంటలో పంటి మొత్తం భాగం కూడా కాలిపోతుంది. కానీ ఎనామిల్ అని పిలవబడే గట్టి భాగం ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది.
- ఈ భాగం కాల్షియం, ఫాస్పేట్ తో తయారు చేయబడుతుంది. కనుక ఇది బలంగా ఉంటుంది. అగ్ని దీనిని కాల్చలేదు.
- ఈ కారణంగా దహన సమయంలో దంతాల భాగం అలాగే ఉండిపోతుంది. కాలిపోదు.
దహనం తర్వాత పళ్లకు ఏమవుతుంది?
దహన సంస్కారాలు జరిగిన రెండు రోజుల తర్వాత స్మశాన వాటిక నుంచి ఎముకలను సేకరిస్తారు. ఈ సమయంలో ఎముకలతో పాటుగా దంతాలు భాగాలను కాల్చని వాటిని సేకరించి ఒక సంచిలో నింపుతారు. తర్వాత గంగా నదిలో లేదా ఇంకేమైనా పవిత్ర నదిలో సముచిత కర్మలతో చనిపోయిన పుణ్యాత్ముని ఆత్మ శాంతిని ప్రసాదించాలని కలుపుతారు. శ్రీహరి పాదాల దగ్గర వారికి స్థానం కల్పించాలని ప్రార్థనలు చేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం