Naga Panchami: నేడు నాగపంచమి పూజను ఆ సమయంలోపే పూర్తి చేయండి, సుఖ సంతోషాలు కలుగుతాయి
Naga Panchami: శివాలయాలన్నీ నాగ పంచమి పండుగకు జనాలతో నిండిపోయాయి. నాగ పంచమి నాడు శివుడితో పాటు నాగదేవతను పూజిస్తారు. శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటైన నాగ పంచమి నేడు నిర్వహించుకోవాలి.
శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటైన నాగ పంచమి. శుక్రవారం ఈ పండుగను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నారు. శివాలయాలన్నీ నాగ పంచమి పండుగకు వైభవంగా సిద్ధమయ్యాయి. నాగ పంచమి నాడు శివుడితో పాటు నాగదేవతను పూజిస్తారు. ఈ రోజున శివుడు పార్వతీదేవితో కలిసి కైలాస పర్వతంపై నివసిస్తాడు. ఈ సమయంలో శివుడి కుటుంబంతో కలిసి సర్పదేవుడిని పూజించడం వల్ల శివ భక్తులకు అన్ని రకాల సంతోషాలు కలుగుతాయి. పాలను, బియ్యాన్ని సర్పదేవతకు సమర్పిస్తారు. నాగ పంచమిలో, ముఖ్యంగా కాలసర్ప దోషాన్ని తొలగించడానికి, ప్రజలు శ్రావణమాసంలో నాగ దేవతను పూజిస్తారు.
శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదో రోజున నాగ పంచమిని నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం పంచమి 9 ఆగష్టు 2024 న అర్ధరాత్రి 12:37 గంటలకు ప్రవేశిస్తుంది. మరుసటి రోజు అంటే ఆగస్టు 10 తెల్లవారుజామున 3:14 గంటలకు ముగుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 12.13 గంటలకు ప్రత్యేక పూజా ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుంది. ఈ ప్రదోష కాలంలో ఈ రోజున నాగదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ కాలంలో పూజ చేస్తే నాగదేవత మీకు సుఖ సంతోషాలను అందిస్తుంది.
సిద్ధయోగం
పండిట్ రాకేష్ పాండే పంచాంగం ప్రకారం, నాగ పంచమి రోజున సధ్య, సిద్ధ యోగం ఏర్పడుతుందని వివరించారు. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం ఏర్పడి శుభకార్యాలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. దీనితో పాటు సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, సంపదలు, కీర్తిని పొందుతారు.
శుక్రవారం నాడు సూర్యుడు హస్తా నక్షత్రానికి అధిపతి, కార్తికేయుడు సిద్ధయోగానికి అధిపతి. ఈ దృష్ట్యా, వివాహంలో బంధంలో ఈ యోగం ఉన్నవారు, ఈ రోజున నాగదేవతను కూడా ఆరాధించవచ్చు. సర్పదేవుడిని పూజించడం వల్ల కుటుంబంలో సంపూర్ణ ఎదుగుదలకు దారితీస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రోజున నాగదేవత ఆలయాల్లో పూజలు చేయాలి.
నాగపంచమి రోజున నాగ దేవతను పాలు, స్వీట్లు,పువ్వులు, దీపాలతో ఆరాధిస్తే ఆ దేవత అనుగ్రహాన్ని పొందవచ్చు. వెండి నాగదేవత, రాయితో చేసిన నాగ దేవత, లేదా చెక్కతో చేసిన నాగదేవత విగ్రహాలను పూజించవచ్చు. అలాగే గోడపై నాగదేవత చిత్రాన్ని పూజించినా మంచిది. మొదట నాగదేవతను నీటితో, పాలతో అభిషేకం చేయాలి. ఇలా అభిషేకం చేస్తూ కింద ఇచ్చిన మంత్రాలను పఠించాలి.
అనంతం వాసుకీం శేషం పద్మనాభం చ
కంబళం శంఖపాలం ధృతరాష్ట్రం నాగానాం చ
మహాత్మన్: సాయంకాలే పఠేన్నిత్యం ప్రాత:కాలే
విశేషత: తస్య విషభయం నాస్తివస్తి
ఈ రోజున ఉపవాసం ఉండి బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంతో మంచిది.ఇలా చేయడం జీవితంలో పాము కాటుకు గురి కాకుండా రక్షణ కలుగుతుంది.
టాపిక్