Check your Personality: మీరు బొటను వేలుని మూసే విధానం మీరు ఎలాంటి వారో చెప్తుంది.. వీళ్ళు బాగా ఎమోషనల్.. మరి మీరో?
Check your Personality: ఒకసారి మీరు మీ బొటన వేలు క్లోజ్ చేసి ఉంచండి. మీరు ఎలా క్లోజ్ చేశారు అనే దాని ద్వారా మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది తెలుసుకోవచ్చు.
Check your Personality: మీరు బొటను వేలుని మూసే విధానం మీరు ఎలాంటి వారో చెప్తుంది
కొన్ని కొన్ని పద్ధతులు ద్వారా మనిషి యొక్క పద్ధతి, తీరు ఎలా ఉంటుందని చెప్పొచ్చు. ఒక మనిషి కూర్చునే విధానం, నడిచే విధానం, నిలబడే విధానంతో వారు ఎలాంటి వారు అనేది అంచనా వేయొచ్చు. అలాగే ఒక మనిషి బొటన వేలుని మూసే పద్ధతి ద్వారా ఆ మనిషి వ్యక్తిత్వం, ఆ మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనే చెప్పొచ్చు.

ఒకసారి మీరు మీ బొటన వేలు క్లోజ్ చేసి ఉంచండి. మీరు ఎలా క్లోజ్ చేశారు అనే దాని ద్వారా మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది తెలుసుకోవచ్చు.
మీ బొటనవేలును క్లోజ్ చేసే పద్ధతి ద్వారా మీరు ఎలాంటి వారో తెలుసుకోండి
ఎడమ చేతి బొటను వేలుపై కుడి చెయ్యి బొటన వేలు
- మీరు మీ బొటన వేలుని క్లోజ్ చేసేటప్పుడు మొదట ఎడమ చేతి బొటనవేలు పెట్టి ఆ తర్వాత కుడి చేతి బొటన వేలును ఉంచినట్లయితే, మీరు బాగా లాజికల్ గా ఉంటారని అర్ధం.
- అలాగే ఇలా క్లోజ్ చేసినట్టయితే, మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని అర్థం.
- లాజికల్ మైండ్ సెట్ ని సూపర్ పవర్ అని మీరు అర్థం చేసుకోవాలి.
- వాస్తవాలను జాగ్రత్తగా చూసే వ్యక్తిత్వం కలవారు.
- చాలా మంది మీ మౌనాన్ని తప్పు పట్టవచ్చు. కానీ మీరు దేనిలోనైనా ముందుకు వెళ్లే ముందు అన్ని కోణాలని పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత మాత్రమే ముందడుగు వేస్తారు.
- కొత్త ఆలోచనలని కొత్త వాటిని ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.
- మీరు లాజికల్ గా ఉన్నప్పటికీ ఫన్నీగా ఉండడం కూడా మీకు తెలుసు.
కుడి చేతి బొటన వేలుపై ఎడమచేతి బొటన వేలు
- ఒకవేళ ముందు మీరు కుడి చేతి బొటను వేలు పెట్టి దానిపై ఎడమ చేతి బొటన వేలుని పెట్టినట్లయితే మీరు చాలా ఎమోషనల్ గా ఉంటారని అర్థం.
- అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా మీకు ఎక్కువ అని అర్థం చేసుకోవాలి.
- మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు సులువుగా కంఫర్ట్ గా ఉంచుతారు.
- అలాగే చుట్టూ ఉన్న వారిని ఈజీగా అర్థం చేసుకుంటారు.
- మీరు చాలా దయతో ఉంటారు.
- వైబ్స్ ని గ్రహించే అద్భుతమైన సామర్ధ్యం నీకు ఉంది.
- ఇతరులను సహజంగా మీ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తారు.
- మీ చుట్టూ ఉన్న ప్రతి దాని గురించి, ప్రతి ఒక్కరి గురించి మీకు బాగా అవగాహన ఉంటుంది. ఇది మీలో ఉండే సూపర్ పవర్.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
ఇంకా జ్యోతిషంగ్రహ సంచారం, దేవాలయాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష పరిహారాలు, ఆధ్యాత్మిక సమాచారం, పండగలు, పూజా విధానం, వ్రత విధానం, రాశి ఫలాలు వంటి కథనాలు చదవండి.