Chinese New Year:అదృష్టాన్ని ఆకర్షించడానికి చైనీస్ నూతన సంవత్సర సంప్రదాయాలు, కుటుంబ ఆచారాలు, వీటిని పాటిస్తే చాలా లాభాలట
Chinese New Year: పంచవ్యాప్తంగా చాలా మంది దీనిని జరుపుకుంటూ ఉంటారు. మనకి ఎలా అయితే 12 రాశులు ఉంటాయో అలాగే చైనీయుల జ్యోతిష్యాల శాస్త్రం ప్రకారం 12 జంతువులు ఉంటాయి. ఈసారి వుడ్ స్నేక్ సంవత్సరం. అదృష్టం కలగడానికి చైనీయులు పాటించే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీ ఒక్కరూ వారి ఇంట్లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అదృష్టం కలిసి వస్తే బాగుండాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే, చైనీస్ న్యూ ఇయర్ సంప్రదాయాలని పాటించడం వలన అదృష్టాన్ని పొందవచ్చు. మరి చైనీయుల ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చైనీస్ న్యూ ఇయర్
చైనీస్ న్యూ ఇయర్ ని లూనార్ న్యూ ఇయర్ అని అంటారు. లేదంటే దీనిని స్ప్రింగ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీనిని జరుపుకుంటూ ఉంటారు. మనకి ఎలా అయితే 12 రాశులు ఉంటాయో అలాగే చైనీయుల జ్యోతిష్యాల శాస్త్రం ప్రకారం 12 జంతువులు ఉంటాయి. ఈసారి వుడ్ స్నేక్ సంవత్సరం. అదృష్టం కలగడానికి చైనీయులు పాటించే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వలన అదృష్టం కలుగుతుంది. సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహిస్తుంది. అందుకని చైనీయులు కొత్త సంవత్సరం రాకముందే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. అందంగా అలంకరించుకుంటారు.
- ఇంట్లో అందమైన పూలను పెట్టడం, ఎర్రటి లాంతర్లను కట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవి సానుకూల శక్తిని తీసుకురావడంతో పాటు అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి.
- ఇంటిని అలంకరించే పద్ధతిలో విరిగిపోయిన సామాన్లు వంటి వాటిని తొలగిస్తారు. ఎందుకంటే వీటిని అశుభంగా పరిగణిస్తారు. అలాగే అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు.
- చైనీయులు పాటించే పురాతన పద్ధతి ఒకటి ఉంది. వీళ్ళు కొత్త ఏడాది ప్రారంభం నాడు కుటుంబ సమేతంగా భోజనం చేస్తారు. ఇలా చేయడం వలన అదృష్టం కలుగుతుందని, నెగిటివ్ ఎమోషన్స్ తొలగిపోతాయని, దురదృష్టం పోతుందని భావిస్తారు.
- ఎర్రటి కవర్లలో డబ్బులు పెట్టి పెద్దవాళ్ళు పిల్లలకు ఇస్తూ ఉంటారు. ఇలా డబ్బులు ఇస్తే అదృష్టం వస్తుందని, ధనం కలుగుతుందని, పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటాయని చెప్తారు.
- ఈరోజు కొత్త బట్టలు వేసుకుంటారు. ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటారు. ఎరుపు రంగు అదృష్టం, సంతోషం, ధనానికి చిహ్నంగా భావిస్తారు. నల్లటి బట్టలు కానీ తెల్లటి బట్టలు కానీ అసలు ఈ రోజు వేసుకోరు.
- చైనీస్ న్యూ ఇయర్ నాడు పెద్దవాళ్ళను గౌరవిస్తారు. పూర్వికులకి ప్రార్థన చేస్తారు. ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. అలాగే చైనీయులు కొత్త సంవత్సరం ప్రారంభంలో సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుతారు. పాజిటివ్ గా కొత్త సంవత్సరాన్ని మొదలుపెడతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం