Chinese Horoscope: 2025లో ఈ చైనీస్ గ్రూప్ వారు ప్రేమలో మునిగిపోతారు.. ఒంటరిగా ఉంటున్న వాళ్ళు ప్రేమలో పడే ఛాన్స్
Chinese Horoscope: మనిషి యొక్క పుట్టిన సంవత్సరం ఆధారంగా ఏ జంతువు గ్రూప్ కి చెందిన వారనేది తెలుసుకోవచ్చు. 2025 వుడ్ స్నేక్ సంవత్సరం. ఈ ఏడాది కొన్ని చైనీస్ గ్రూపుల వారికి సంతోషం ఉంటుంది. మరి మీ చైనీస్ గ్రూప్ కూడా ఇందులో ఉందేమో చూసుకోండి. ముఖ్యంగా ప్రేమలో ఈ చైనీస్ గ్రూప్ వాళ్ళు మునిగిపోతారు.
ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు జ్యోతిష్యం కూడా మనపై ప్రభావితం చూపిస్తుంది. మనకు ఎలా అయితే 12 రాశులు ఉన్నాయో చైనీస్ జ్యోతిష్య శాస్త్రంలో జంతువులు ఉన్నాయి.

మనిషి యొక్క పుట్టిన సంవత్సరం ఆధారంగా ఏ జంతువు గ్రూప్ కి చెందిన వారనేది తెలుసుకోవచ్చు. 2025 వుడ్ స్నేక్ సంవత్సరం. ఈ ఏడాది కొన్ని చైనీస్ గ్రూపుల వారికి సంతోషం ఉంటుంది. మరి మీ చైనీస్ గ్రూప్ కూడా ఇందులో ఉందేమో చూసుకోండి.
ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, బాధ రెండూ ఉంటాయి. ఒక సారి సంతోషంగా ఉంటే ఇంకోసారి బాధ ఉంటుంది. ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పలేము. అయితే 2025 వీళ్ళకు మాత్రం సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రేమలో ఈ చైనీస్ గ్రూప్ వాళ్ళు మునిగిపోతారు.
1.ఎలుక (1936, 1948, 1960, 1972, 1984, 1996, 2008, 2020)
ఎలుక గ్రూప్ కి చెందిన వ్యక్తులు ఈ కొత్త సంవత్సరం సంతోషంగా ఉంటారు. 2025 వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఎలుక గ్రూప్ కి చెందిన వారు సరైన మార్గంలో ఉన్నారు. గౌరవం, మనోజ్ఞతను తీసుకువస్తుంది. తేజస్సుని పెంచుతుంది. ఈ సంవత్సరం ఎలుక గ్రూప్ కి చెందిన వారు ఉత్సాహంగా ఉంటారు. ప్రేమ జీవితం బాగుంటుంది. సింగిల్ గా ఉంటున్న వాళ్ళు ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా వుంది.
2. గుర్రం (1942, 1954, 1966, 1978, 1990, 2002, 2014)
ఈ సంవత్సరం గుర్రం గ్రూప్ కి చెందిన వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు. సూర్యుడి కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శక్తిని అందుకుంటారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలని పెంచుకుంటారు. పాఠశాల, విశ్వవిద్యాలయం లేదా వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాల ద్వారా లోతైన కనెక్షన్ ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. కమిట్ అయిన వాళ్ళకి కూడా ప్రేమ జీవితం చాలా బాగుంటుంది.
3. కోతి (1944, 1956, 1968, 1980, 1992, 2004, 2016)
2025 లో కోతి గ్రూప్ కి చెందిన వారు కూడా సంతోషంగా ఉంటారు.ఒంటరిగా ఉంటున్న వాళ్ళు జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది. అలాగే ఇతరులను కూడా ఆకట్టుకుంటారు. అందరికీ చేరువవుతారు.
4. కుక్క (1946, 1958, 1970, 1982, 1994, 2006, 2018)
2025 కుక్క గ్రూప్ కి చెందిన వారికి అదృష్టం కలుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ప్రేమలో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఈవెంట్లలో లేదంటే మరి ఏదైనా ప్రదేశంలో మీరు మీ జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మీకు సంతోషంగా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం