Chinese Horoscope: 2025 వుడ్ స్నేక్ సంవత్సరం.. దీని అర్థం ఏంటి? ఏ చైనీస్ రాశి చక్రాలు అదృష్టాన్ని పొందుతాయో తెలుసుకోండి-chinese horoscope 2025 wood snake year check which chinese zodiac groups will get benefits and how ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chinese Horoscope: 2025 వుడ్ స్నేక్ సంవత్సరం.. దీని అర్థం ఏంటి? ఏ చైనీస్ రాశి చక్రాలు అదృష్టాన్ని పొందుతాయో తెలుసుకోండి

Chinese Horoscope: 2025 వుడ్ స్నేక్ సంవత్సరం.. దీని అర్థం ఏంటి? ఏ చైనీస్ రాశి చక్రాలు అదృష్టాన్ని పొందుతాయో తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu

Chinese Horoscope 2025: చివరి సారిగా ఇయర్ ఆఫ్ ది వుడ్ స్నేక్ ని 1965 లో జరుపుకున్నారు. దీని అర్థం ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆ విషయాలను కూడా చూసేద్దాం. అలాగే వుడ్ స్నేక్ వలన ఏయే రాశుల గ్రూప్ వారికీ బాగుంటుంది అనేది కూడా చూసేద్దాం.

Chinese Horoscope: 2025 వుడ్ స్నేక్ సంవత్సరం.. దీని అర్థం ఏంటి? (pinterest)

చైనీయుల సంస్కృతిలో చైనీస్ న్యూ ఇయర్ అనేది ఒక ముఖ్యమైన సమయం. చైనీస్ నూతన సంవత్సరం తేదీ చంద్ర క్యాలెండర్ ద్వారా నిర్ణయించబడుతుంది.

డిసెంబర్ 21న శీతాకాలం తర్వాత రెండవ అమావాస్య పై వస్తుంది, సాధారణంగా గ్రైగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 21 మరియు ఫిబ్రవరి మధ్య ఇది ఉంటుంది.

చైనీస్ న్యూ ఇయర్ ఎప్పుడు మొదలు అవుతుంది?

2025 లో చైనీస్ న్యూ ఇయర్ జనవరి 29న ప్రారంభం అవుతుంది. 15 రోజుల పాటు వేడుకలు జరుపుతారు.

ఈ సంవత్సరం చైనాలో వుడ్ స్నేక్ సంవత్సరం. ఇది ప్రవర్తన మరియు పెరుగుదల సమయాన్ని సూచిస్తుంది. ఫిబ్రవరి 16, 2026 వరకు ఇది ఉంటుంది.

చివరి సారిగా ఇయర్ ఆఫ్ ది వుడ్ స్నేక్ ని 1965 లో జరుపుకున్నారు. దీని అర్థం ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆ విషయాలను కూడా చూసేద్దాం. అలాగే వుడ్ స్నేక్ వలన ఏయే రాశుల (Chinese Horoscope) గ్రూప్ వారికీ బాగుంటుంది అనేది కూడా చూసేద్దాం.

వుడ్ స్నేక్ అంటే ఏంటి?

చైనీస్ రాశి చక్రంలో ఆరవ జంతువు అయిన పాము అంతదృష్టి అలాగే వ్యూహాన్ని సూచిస్తుంది. వుడ్ స్నేక్ మూలంకంతో కలిసినప్పుడు 2025 అనుకూలత దీర్ఘకాలిక ప్రణాళికకు సమానం.

ఈ మూడు గ్రూపులకి లాభాలు

పాము:

పాములు సంవత్సరం కాబట్టి వారి సొంత సంస్థలోనే అనుకూలంగా ఉంటుంది. 2025 కెరియర్ పురోగతికి, వ్యక్తిగత ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది.

కోడి:

కచ్చితం, క్రమశిక్షణకు పేరుగాంచిన కోడి.. పాము సంవత్సరానికి వారి లక్షణాలు కలిగినంగా కనుగొంటాయి. కెరియర్లో అవకాశాలని చూస్తారని చెప్పచ్చు.

డ్రాగన్:

డ్రాగన్ బోల్డ్ ఎనర్జీ పాము యొక్క వ్యూహాత్మక స్వభావంతో సమలేఖనం అవుతుంది. వెంచర్లలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇలా ఈ మూడు గ్రూపుల వారికి ప్రయోజనం కలగబోతోంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సంబంధిత కథనం