Sitting Posture: కూర్చునే భంగిమ ఆధారంగా మీరెలాంటి వారో తెలుసుకోండి.. వీళ్ళు మాత్రం ఇతరులను ఈజీగా ఆకర్షిస్తారు, మరి మీరు?-check your personality based on sitting posture see the things how many you know about yourself and which you dont know ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sitting Posture: కూర్చునే భంగిమ ఆధారంగా మీరెలాంటి వారో తెలుసుకోండి.. వీళ్ళు మాత్రం ఇతరులను ఈజీగా ఆకర్షిస్తారు, మరి మీరు?

Sitting Posture: కూర్చునే భంగిమ ఆధారంగా మీరెలాంటి వారో తెలుసుకోండి.. వీళ్ళు మాత్రం ఇతరులను ఈజీగా ఆకర్షిస్తారు, మరి మీరు?

Peddinti Sravya HT Telugu
Jan 29, 2025 12:00 PM IST

Sitting Posture: ఒక వ్యక్తి తరచుగా ఎలా కూర్చుంటాడు అనేది గమనించడం ద్వారా వారి వ్యక్తిత్వం, అంతర్గత భావాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చెప్పొచ్చు. మరి మీరు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే సులువుగా మీరు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.

Sitting Posture: కూర్చునే భంగిమ ఆధారంగా మీరెలాంటి వారో తెలుసుకోండి
Sitting Posture: కూర్చునే భంగిమ ఆధారంగా మీరెలాంటి వారో తెలుసుకోండి (pinterest)

ఒక వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. వారు కూర్చున్న భంగిమ కూడా వారి వ్యక్తిత్వ లక్షణాలను చెప్తుంది. ఒక వ్యక్తి తరచుగా ఎలా కూర్చుంటాడు అనేది గమనించడం ద్వారా వారి వ్యక్తిత్వం, అంతర్గత భావాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చెప్పొచ్చు. మరి మీరు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే సులువుగా మీరు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.

సంబంధిత ఫోటోలు

1.మోకాళ్ళని నిటారుగా పెట్టి కూర్చోవడం

చాలా మంది కూర్చునేటప్పుడు మోకాళ్ళను నిటారుగా పెట్టి కూర్చుంటారు. దీనికి అర్థం ఏంటంటే నిజాయితీగా, సమయపాలనను పాటిస్తూ ఉన్నారని అర్థం. ఆత్మవిశ్వాసంతో ఉంటారని అర్థం చేసుకోవచ్చు.

అలాగే వీళ్ళు సమగ్రతను కలిగి ఉంటారు. జీవితం పట్ల సానుకూలంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వృత్తిపరమైన జీవితాల్లో విశ్వసనీయ వ్యక్తిగా ఉంటారు. వీరితో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఈ వ్యక్తులు గాసిప్స్ కి దూరంగా ఉంటారు. ఇతరులతో సూటిగా మాట్లాడుతారు. రిలేషన్షిప్ విషయానికి వస్తే, వీళ్ళు ప్రేమించే వ్యక్తితో విశ్వసనీయంగా కట్టుబడి ఉంటారు.

2.మోకాళ్ళను దూరంగా ఉంచి కూర్చోవడం

అదే ఒక వ్యక్తి మోకాళ్ళను దూరంగా ఉంచి కూర్చుంటున్నట్లయితే, తరచుగా మాట్లాడతారని, అహంబావి అని అర్థం చేసుకోవాలి. మోకాళ్ళను పక్కన పెట్టుకు కూర్చునే వ్యక్తులు తక్కువ ఆత్మ గౌరవం కలిగి ఉంటారు. అతిగా ఆలోచిస్తారు.

ఈజీగా పరధ్యానంలో పడడం లేదా పెర్ఫెక్షనిస్ట్ అయినా కావచ్చు. రిలేషన్ విషయానికి వస్తే, ఇలా కూర్చునేవారు తరచుగా వారి జీవిత భాగస్వామితో గొడవలు పడడం వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి.

3.కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం

ఇలా కూర్చునేవారు సానుభూతి కలవారు. సృజనాత్మకంగా, ఊహాత్మకంగా ఉంటారు. స్నేహపూర్వకంగా కూడా ఉంటారు. సులభంగా వీళ్ళు ఇతరులని నమ్మరు. అలాగే జీవితంలో వ్యక్తుల్ని అనుమతించడానికి చాలా సమయం పడుతుంది.

వీళ్ళు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవారు. వీరు జీవిత భాగస్వామి కోరికలు అవసరాలని జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ విషయాన్నైనా చాలా ఓపెన్ గా మాట్లాడుతారు.

4.మోకాళ్ళను క్రాస్ గా ఉంచి కూర్చోవడం

ఇలా కూర్చోవడం గంభీరం, హుందాతనం, ప్రశాంతమైన ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. వీళ్ళు ఇచ్చే ప్రేరణను చూసి అందరూ ఇంప్రెస్ అవుతూ ఉంటారు. మార్గదర్శకత్వం కోసం వీళ్లపై ఆధారపడతారు. వీళ్ళు వేసిన ప్రణాళిక, ఆలోచనలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు.

4.ఒక కాలు పై ఇంకో కాలు వేసుకోవడం

ఇలా కూర్చునే వారు ఎక్కువ కాంపిటీషన్ ఇస్తారు. కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువే. వీళ్ళు చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. జీవితంపై ఫోకస్డ్ గా ఉంటారు. రిలేషన్షిప్ విషయానికి వస్తే కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా మాట్లాడతారు. అయితే కొన్ని కొన్ని సార్లు చాలా మొండగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కోసారి మాత్రం భాగస్వామి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోలేక పోతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం