పలు పురాణాలు సరస్వతి నదిని వర్ణించాయి. 'పంచలింగ బ్రాహ్మణం' ప్రకారం సరస్వతి నది మహాప్రబలమైన నది. సింధు నాగరికతలకు అదే ప్రామాణికం. ఈ నది ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వెడల్పుతో స్థిరమైనదిగా ఉంది, ఒక్కో చోట పదునాలుగు కిలోమీటర్ల వెడల్పుతో విలసిల్లిన నది. విసృత భూగర్భాన్వేషణలను బట్టి సరస్వతీ నది పెక్కు సార్లు తన ప్రవాహ దిశను మార్చుకుంటూ, క్రీ.పూ.1900 ప్రాంతంలో పూర్తిగా ఎండిపోయినట్లు కనుగొన్నారు.
మహాభారత యుద్ధం కాలం నాటికీ శుషించిపోయి ఎడారిలో కలిసిపోయినట్లు పౌరాణికుల అంచనా. అంతకు ముందు సరస్వతి సింధుల డెల్టాలతో ఆనాటి పశ్చిమ భారతం కళకళలాడుతూ సింధుగా ప్రవహించేది అని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అందుకే భారతీయ మంత్రాలలో గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు.. అని చదువుకుంటుంటాం. తాము అభిషేకించే జలంలోకి ఆయా పవిత్ర నదీ జలాలను ఆవాహన చేసుకోవడం, సంప్రదాయంగా తీసుకున్నాయి. రుగ్వేదం సరస్వతీ నదిని పవిత్రమాతగా స్తుతిస్తోంది. ఈ నది సరస్సులు (సారాస్) గా విభజింపబడిందనీ స్పష్టంగా నమోదు చేశారు. స్కంద పురాణం ప్రకారం సరస్వతి బ్రహ్మ నీటి కుండ నుండి ఉద్భవించి, హిమాలయాలపై వున్న పిప్పల వృక్షం మీద నుంచి ప్రవహిస్తుంది.
ఇది కేదారం వద్ద పశ్చిమ దిశకు తిరిగి, అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవహిస్తుంది. ఇందులోనే సరస్వతీ నది ఐదు శాఖలను పేర్కొన్నారు. ఈ పాఠ్యం సరస్వతిని బ్రహ్మ భార్య బ్రాహ్మిగా చిత్రీకరించింది. వామన పురాణం ప్రకారం, సరస్వతి నది పిప్పల వృక్షం నుంచి పెరిగిందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
స్మృతులలో పేర్కొన్న అంశాలు మను స్మృతి ప్రకారం, వరదల నుండి తప్పించుకున్న సాధువు మనువు సరస్వతి, దృషద్వతి నదుల మధ్య వేద సంస్కృతిని స్థాపించాడు. ఈ సరస్వతి నది బ్రహ్మవర్తానికి పశ్చిమ సరిహద్దుగా ఉందనీ, "సరస్వతి, దృషద్వతి మధ్య ఉన్న భూమి దేవుని సృష్టి అయిన బ్రహ్మావర్తం" అనీ మను స్మృతిలో పేర్కొన్నారు. వశిష్టుని ధర్మ సూత్రాల్లోని శ్లోకాలు ఆర్యావర్తాన్ని సరస్వతీ నది. ఎడారిలో అదృశ్యమైన ప్రాంతానికి తూర్పున, కలకవానాకు పశ్చిమాన, పరియాత్రా, వింధ్య పర్వతాలకు ఉత్తరాన, హిమాలయాల దక్షిణాన ఉన్నట్టు ప్రస్తావిస్తు న్నాయి.
పతంజలి మహాభాష్యం కూడా ఆర్యావర్తాన్ని వశిష్టుని ధర్మ సూత్రాల్లానే వర్ణించింది. బౌద్ధయానా ధర్మసూత్రాలు ఆర్యావర్తం అంటే కలకవానాకు పశ్చిమాన, సరస్వతీ నది అదృశ్యమైన ఎడారి అయిన ఆదర్శనకి తూర్పున, హిమాలయాలకు దక్షిణాన, వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమి అని ప్రకటించారు. నదితో కాక భాషతో అనుసంధానిస్తూంటాయి. మైఖేల్ విజెల్ కూడా ఋగ్వేదంలో సరస్వతి అప్పటికే దాని ప్రధాన నీటి వనరును కోల్పోయి, చేరుకోవాల్సిన తుది సరస్సు (సముద్రం)లో ముగిసి పోతుందని ప్రస్తావించాయని పేర్కొన్నాడు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
హిందువులు సరస్వతీ నదిని అంతర్వాహినిగానూ, గంగా యమునల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తోందనీ భావిస్తారు. స్వర్గం వద్ద ఉండే క్షీరవాహిని, వైదిక సరస్వతీ నది ఒకటేనని, మరణానంతరం అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారనీ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడు, హార్వర్డ్ ఓరియంటల్ సీరీస్కి సంపాదకుడు అయిన మైఖేల్ విజెల్ భావించాడు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000