వార ఫలాలు : ఈ రాశివారు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి-check all zodiac signs prediction for this week from 19th november to 25th november 2023 weekly horoscope telugu ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Check All Zodiac Signs Prediction For This Week From 19th November To 25th November 2023 Weekly Horoscope Telugu

వార ఫలాలు : ఈ రాశివారు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి

HT Telugu Desk HT Telugu
Nov 19, 2023 04:30 AM IST

Weekly Horoscope In Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. నవంబర్ 19 నుంచి నవంబర్ 25 వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వారం రాశి ఫలాలు

తెలుగు రాశిఫలితములు (వార ఫలితము) 19.11.2023 నుండి 25. 11.2023 వరకు, సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : దక్షిణయనం, మాసం : కార్తీకం

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం జన్మరాశిలో గురుడు, అష్టమస్థానంలో రవి, బుధ, కుజులు సంచారం వలన మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమరవి ప్రభావంచేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. శని లాభస్థానములో అనుకూలించడం వలన ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు అధికమగును. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. ప్రయాణాలు అనుకూలించును. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణిడిని పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం కళత్రస్థానములో రవి, బుధ, కుజుల సంచారం వలన మీకు అంత అనుకూలంగా లేదు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. వ్యయస్థానములో గురుని ప్రభావం వలన ఖర్చులు అధికమవుతాయి. ఆప్తుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ఆలస్యంగా సాగుతాయి. వైద్యపరీక్షలు అవసరమవుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వేడుకకు హాజరవుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం శత్రు స్థానములో రవి, బుధ, కుజుల సంచారం వలన మరియు భాగ్యస్థానములో శని ప్రభావంచేత మధ్యస్థముగా ఉన్నది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. నిదానంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విజ్ఞతను చాటుకుంటారు. బాధ్యతగా మెలగాలి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. మిథునరాశివారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం కోణమునందు రవి, బుధ, కుజుల సంచారం వలన మరియు అష్టమశని ప్రభావంచేత మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం, ఆదాయం బాగుంటుంది. అవిశ్రాంతగా శ్రమిస్తారు. సంప్రదింపులకు అనుకూల సమయం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. కర్కాటకరాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పరించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం కేంద్రమునందు రవి, బుధ, కుజుల ప్రభావంచేత అలాగే భాగ్యస్థానములో గురుని ప్రభావం వలన మీకు అనుకూలంగా ఉన్నది. మీ కష్టం వృథా కాదు. అవకాశాలను దక్కించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి ఉపయోగపడతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పనులు చురుకుగా సాగుతాయి. సందర్భానికి తగినట్లుగా వ్యవహరిస్తారు. ఆలోచనల్లో మార్పువస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వేడుకకు సన్నాహాలు చేస్తారు. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సింహరాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం తృతీయస్థానములో రవి, బుధ, కుజులు అనుకూలంగా ఉండటం, ఆరో స్థానములో శని అనుకూల ప్రభావంవలన మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. పరిచయం లేనివారితో జాగ్రత్త. వాగ్వివాదాలకు దిగవద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ప్రియతముల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం వాక్‌ స్థానములో రవి, బుధ, కుజుల సంచారం వలన వ్యయస్థానములో శుగక్ర, కేతువుల అనుకూలం వలన మీకు అంత అనుకూలంగా లేదు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రతీ చిన్న విషయానికి అందోళనపడతారు. ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు వలన చికాకులు కలుగుతుంది. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పరించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం జన్మరాశిలో రవి, బుధ, కుజుల ప్రభావం వలన మీకు అంత అనుకూలంగా లేదు. జన్మరవి ప్రభావం వలన పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిపెడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అప్తుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కీలకపత్రాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం తృతీయంలో శని, పంచమంలో గురుడు అనుకూల ప్రభావంచేత దశమంలో శుక్ర, కేతువుల అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. వ్యయస్థానములో రవి, కుజుల ప్రభావం వలన ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వాహనయోగం ఉన్నాయి. మీ సమర్ధతను చాటుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఒక సంఘటన ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. అధ్యాత్మికత పెరుగుతుంది. ధనూరాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ వారం వాక్‌స్థానములో ఏలినాటిశని ప్రభావం ఉన్నప్పటికి లాభములో రవి, కుజు, బుధుల అనుకూలత వలన మీకు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా నిలబడతారు. ఖర్చులు ఉపయోగకరం. గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి మంచి అవకాశం లభిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. కొత్త వ్యక్తులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగత్ర అవసరం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావం అలాగే తృతీయంలో గురుని ప్రభావం మరియు దశమంలో రవి, బుధ, కుజుల అనుకూలత వలన మీకు మధ్యస్థముగా ఉన్నది. రావలసిన ధనం సమయానికి అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. అపరిచితులతో జాగ్రత్త. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం భాగ్యములో రవి, బుధ, కుజుల సంచారం వలన అలాగే ధనస్థానమునందు గురుని ప్రభావంచేత ఏలినాటి శని ఉన్నప్పటికి మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా సత్ఫలితాలున్నాయి. ధనలాభం, వస్తు ప్రాప్తి ఉన్నాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలసివస్తాయి. ఆశాదృక్పథంతో మెలగండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అధ్యాత్మికత పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

WhatsApp channel