ఈరోజు నుంచి చాతుర్మాసం.. ఈ నాలుగు నెలలు ఏం చేయాలి?, ఏం చేయకూడదో తెలుసుకోండి!-chaturmasam is from today check what to do and what we should not do these four months ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు నుంచి చాతుర్మాసం.. ఈ నాలుగు నెలలు ఏం చేయాలి?, ఏం చేయకూడదో తెలుసుకోండి!

ఈరోజు నుంచి చాతుర్మాసం.. ఈ నాలుగు నెలలు ఏం చేయాలి?, ఏం చేయకూడదో తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

తొలి ఏకాదశి నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. అప్పటి నుంచి చాతుర్మాసం మొదలవుతుంది. ఇది నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో యజ్ఞం, వివాహం, గృహప్రవేశం వంటివి చేయకూడదు. ఇక మరి ఈ నాలుగు నెలలు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి.

చాతుర్మాసంలో కొన్ని పనులు చేయడం నిషేధం (Pixabay)

ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. దీనిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. అప్పటి నుంచి చాతుర్మాసం మొదలవుతుంది. ఇది నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. జూలై 5న ఏకాదశి తిథి సాయంత్రం 6:58 గంటలకు మొదలై, జూలై 6 రాత్రి 9:14 వరకు ఉంటుంది. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి.

కనుక జూలై 6న తొలి ఏకాదశి జరుపుకోవాలని సూచించబడుతుంది. ఈరోజు నుంచి విష్ణువు క్షీరసాగరంలో నిద్రించి, ప్రబోధినీ ఏకాదశి నాడు మేలుకొంటారు. ప్రబోధినీ ఏకాదశి కార్తీక మాసంలో వస్తుంది. ఈ నాలుగు నెలలు దేవతలు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయంలో యజ్ఞం, వివాహం, గృహప్రవేశం వంటివి చేయకూడదు.

చాతుర్మాసంలో కొన్ని పనులు చేయడం నిషేధం

  1. చాతుర్మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణం, పుట్టు వెంట్రుకలు తీయించడం వంటివి చేయకూడదు. ఈ సమయంలో విష్ణువు, లక్ష్మీ ఒకే నిద్రలో ఉంటారు.
  2. ముఖ్యమైన పనులు మొదలుపెట్టడానికి ఇది మంచిది కాదు. పెద్ద ప్రాజెక్టులు స్వీకరించడం వంటివి లేకుండా ఉంటే మంచిది. సక్సెస్‌ని అందుకోవాలంటే ఈ పొరపాటు చేయకుండా చూసుకోవాలి.
  3. చాతుర్మాసం సమయంలో శాకాహారాన్ని, సాత్విక ఆహారాన్ని తినడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. వీలైతే మాంసాహారానికి, ఉల్లిపాయలకు దూరంగా ఉండటం మంచిది. అబద్ధాలు చెప్పడం, అగౌరవకంగా మాట్లాడడం, కోప్పడడం వంటివి మంచిది కావు.

చాతుర్మాసంలో ఏం చేయాలి?

  • చాతుర్మాసంలో శివుడిని ఆరాధిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.
  • మంత్రాలు, భజనలు, కీర్తనలు వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.
  • ఈ సమయంలో దానాలు కూడా చేయవచ్చు. చాతుర్మాసంలో వస్త్రదానం చేయడం, అన్న దానం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి.
  • ముఖ్యమైన శుభదినాల్లో ఉపవాసం ఉండడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సానుకూల మార్పులను తీసుకువస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.