Chaturgrahi yogam: హనుమాన్ జయంతి రోజు చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల జాతకులు ధనవంతులు కాబోతున్నారు-chaturgrahi trigrahi yogam in meena rashi on the day of hanuman jayanti ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chaturgrahi Yogam: హనుమాన్ జయంతి రోజు చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల జాతకులు ధనవంతులు కాబోతున్నారు

Chaturgrahi yogam: హనుమాన్ జయంతి రోజు చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల జాతకులు ధనవంతులు కాబోతున్నారు

Gunti Soundarya HT Telugu
Apr 22, 2024 05:06 PM IST

Chaturgrahi yogam: హనుమాన్ జయంతి రోజు కుజుడు మీన రాశి ప్రవేశం చేస్తాడు. దీంతో ఒకే రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా కొన్ని రాశుల జాతకులు ధనవంతులు కాబోతున్నారు.

హనుమాన్ జయంతి రోజు చతుర్గ్రాహి యోగం
హనుమాన్ జయంతి రోజు చతుర్గ్రాహి యోగం

Chaturgrahi yogam: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కుజుడు, శుక్రుడు, బుధుడి కలయిక చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ నాలుగు గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నాయి. ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి రోజున ఈ గ్రహాలు మీనరాశిలో సంచరించడంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల చాలా సంవత్సరాల తర్వాత మీనరాశిలో ఈ చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.

yearly horoscope entry point

కుంభ రాశిని వదిలి కుజుడు ఏప్రిల్ 23వ తేదీన మీన రాశి ప్రవేశం చేస్తాడు. ఇప్పటికే అక్కడ బుధుడు, శుక్రుడు, రాహువు ఉన్నారు. వీటితో పాటు కుజుడు వచ్చి చేరడంతో నాలుగు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి లాభాలను తెచ్చిపెడుతుంది. మీన రాశిలో నాలుగు పెద్ద గ్రహాల కలయిక ఏయే రాశుల వారికి విపరీతమైన లాభాలు ఇస్తుందో తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి.

మిథున రాశి

నాలుగు గ్రహాల కలయిక మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. చతుర్గ్రాహి యోగం ఈ రాశి వారి జీవితాన్ని మార్చబోతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కల నెరవేరే అవకాశం ఉంది. ఆర్థికంగా దృఢంగా ఉండాలంటే పెట్టుబడితో పాటు పొదుపుపై కూడా దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. హైడ్రేట్ గా ఉంటూ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

కర్కాటక రాశి

కుజుడు, శుక్రుడు, రాహువు, బుధుడి కదలిక కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తిలో బాస్ నుండి మద్దతు పొందుతారు. అనేక కొత్త బాధ్యతలు కూడా మీ మీద ఉంటాయి. ఆదాయం పెంచుకోవడానికి అనేక మంచి అవకాశాలు పొందుతారు. కానీ కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. అప్పుడే ఆర్థికంగా మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రకాశవంతంగా ఆరోగ్యంగా ఉండేందుకు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.

వృషభ రాశి

చతుర్గ్రాహి యోగం వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అందించబోతుంది. వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పటికీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మర్చిపోవద్దు.

మీన రాశిలో చతుర్గ్రాహి యోగంతో పాటు గ్రహాల రాకుమారుడు బుధుడు, శుక్రుడు, రాహువు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది. సుమారు 50 సంవత్సరాల తర్వాత మీన రాశిలో ఈ యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ మూడు గ్రహాల కదలిక కొన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీన రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల ఏ రాశి వారి భవితవ్యం మారుతుందో తెలుసుకుందాం.

మిథున రాశి

రాహువు, శుక్రుడు, బుధుడి సంచారం మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. గ్రహాల శుభ ప్రభావంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. నిలిచిపోయిన డబ్బు కూడా అందే అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి

మూడు గ్రహాల కలయిక కుంభ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు ఉంటాయి. ఈ సమయంలో వ్యాపార పరిస్థితి బాగుంటుంది. డబ్బు వస్తుంది. నూతన ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మీన రాశి

మూడు గ్రహాలు కలయిక మీన రాశిలోనే జరగడం వల్ల ఈ రాశి వారికి బంపర్ ప్రయోజనాలు కలగనున్నాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తిలో నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. ప్రేమ జీవితంలో శృంగారాన్ని ఆస్వాదిస్తారు. పెట్టుబడికి మంచి సమయం.

 

Whats_app_banner