Office Stress Mantras: ఆఫీస్ ఒత్తిడి నుంచి బయటపడాలంటే.. ఈ 9 శక్తివంతమైన మంత్రాలను జపించి చూడండి.. ప్రశాంతత కలగవచ్చు
Office Stress Mantras: జ్యోతిష శాస్త్రం ప్రకారం మంత్రాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. వర్క్ లోడ్ తగ్గడానికి, వర్క్ ప్రెషర్, ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ మంత్రాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని పఠిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
చాలామంది ఆఫీసులో ఒత్తిడి కలిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆఫీసులో ఒత్తిడి నుంచి బయటపడాలనుకుంటున్నారా? ఆఫీసులో ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటే ఈ మంత్రాలు బాగా పనిచేస్తాయి. చాలామంది తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆఫీసులో కలిగే ఒత్తిడి నుంచి బయట పడడానికి అద్భుతమైన మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. వీటిపై ఒక లుక్ వేసేయండి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం మంత్రాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. వర్క్ లోడ్ తగ్గడానికి, వర్క్ ప్రెషర్, ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ మంత్రాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని పఠిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
సనాతన ధర్మంలో చాలా ఏళ్ల నుంచి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వేదాలు, పురాణాలు కూడా మన పని, సమస్య ప్రకారం మంత్రాల విభజన మంత్రాలను జపించే పద్ధతుల్ని పేర్కొన్నాయి. ఆఫీసు నుంచి ఉత్పన్నమయ్యే ఒత్తిడిని తగ్గించడానికి ఈ శక్తివంతమైన మంత్రాలు అద్భుతంగా పనిచేస్తాయి.
ఆఫీస్ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ శక్తివంతమైన మంత్రాలని జపించండి. సమస్యను బట్టి మంత్రం దాని పద్ధతిని తెలుసుకోవడం ముఖ్యం. ఆఫీసు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉద్యోగులు ఈ మంత్రాలని జపిస్తే మంచిది.
ఆఫీసు ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఈ మంత్రాలను జపించండి
- ఓం
- ఓం నమః శివాయ
- ఓం అస్య బృహస్పతి నమః
- ఓం అనుష్టుప్ ఛందసే నమః:
- ఓం సురాచార్యో దేవతాయై నమః
- ఓం భూర్భువః స్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధియో యో న: ప్రచోదయాత్
- ఓం బృహస్పతే అతి యదర్యో అర్హద్ ద్యుమ్ద్విభాతి క్రతుమజ్జనేషు యద్దిదయచ్ఛ్వాస్ ఋత్ప్రజాత్ తదస్మాసు ద్రవిణం ధేహి చిత్రమ్.
- ఓం హౌం జున్ స: ఓం భూర్భువః స్వ: ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వరుకమివ్ బంధనన్ మృత్యోర్ముక్షీయ మమృతాత్ ఓం స్వ: భువ: భూ: ఓం స: జున్ హౌం ఓం
- దుర్జనః సజ్జనో భూయాత్ సజ్జనః సుఖమాప్నుయాత్
మంత్రాలు జపించే విధానం
- మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను నేలపై పెట్టి భుజాలని విశ్రాంతిగా ఉంచండి.
- ఒక నిమిషం పాటు శ్వాస తీసుకుని ఏకగ్రత పెడుతూ ఈ మంత్రాన్ని జపించండి. పైన చెప్పిన మంత్రాల్లో మీరు మీకు నచ్చిన మంత్రాన్ని జపించొచ్చు. ఆఫీసులో ఉన్న ఒత్తిడిని తొలగించడంతో పాటుగా మానసిక సమస్యల్ని తగ్గించి, ప్రొడక్టివిటీని మెరుగుపరుస్తుంది.
- ఇలా మీరు వీటిని జపించడం వలన ఒత్తిడి తగ్గడమే కాకుండా మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.
మంత్రాలు ఒత్తిడిని తగ్గించడానికి ఎలా పనిచేస్తాయి?
ధ్వని, లయ
మంత్రాలు ధ్వని, శ్వాసలను కలపడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తాయి. మనసును తేలిక పరుస్తాయి. మిమ్మల్ని స్థిరంగా ఉంచుతాయి.
పునరావృత్తం
ఒక అధ్యయనం ప్రకారం మంత్రాన్ని పునరావృత్తం చేసినప్పుడు ఏకాగ్రత కలుగుతుంది. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.