ఈ శక్తివంతమైన మంత్రాలను జపిస్తే సంతాన భాగ్యం కలగొచ్చు..-chant these mantras for reproductive health ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ శక్తివంతమైన మంత్రాలను జపిస్తే సంతాన భాగ్యం కలగొచ్చు..

ఈ శక్తివంతమైన మంత్రాలను జపిస్తే సంతాన భాగ్యం కలగొచ్చు..

Peddinti Sravya HT Telugu

చాలా మందికి పెళ్లి అయ్యి చాలా కాలం అయినప్పటికీ పిల్లలు కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో ఆలయాలకి వెళ్లి పూజలు చేసిన ఫలితం ఉండకపోవచ్చు. అయితే ఈ మంత్రాలని జపిస్తే మాత్రం సంతాన భాగ్యం కలిగే అవకాశం ఎక్కువ ఉంది. సంతాన ప్రాప్తి కలగాలంటే ఈ శక్తివంతమైన మంత్రాలని జపించండి.

Mantras for getting pregnant: ఈ శక్తివంతమైన మంత్రాలను జపిస్తే సంతాన భాగ్యం (Shutter stock )

చాలా మంది సంతానం కలగడానికి ఎన్నో నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. చాలా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. కానీ సంతాన భాగ్యం కలగదు. మీరు కూడా సంతాన భాగ్యం కలగాలని అనుకుంటున్నారా? అయితే, ఈ మంత్రాలను జపించి చూడండి. సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది.

చాలా మందికి పెళ్లి అయ్యి చాలా కాలం అయినప్పటికీ పిల్లలు కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో ఆలయాలకి వెళ్లి పూజలు చేసిన ఫలితం ఉండకపోవచ్చు. అయితే ఈ మంత్రాలని జపిస్తే మాత్రం సంతాన భాగ్యం కలిగే అవకాశం ఎక్కువ ఉంది. సంతాన ప్రాప్తి కలగాలంటే ఈ శక్తివంతమైన మంత్రాలని జపించండి.

1. సంతాన గోపాల మంత్రం

మంత్రాన్ని జపిస్తే సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మీ చేతుల్లో ఒక చిన్న బిడ్డను ఊహించుకోండి. వైద్యులు మీ గురించి ఏం చెప్పినా వాటిని పక్కన పెట్టండి. ఈ మంత్రాన్ని బిడ్డ ఉన్నట్లు ఊహించుకుంటూ జపించినట్లయితే గర్భిణీ అయ్యే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలగొచ్చు. 'ఓం శ్రీం హ్రీం క్లిమ్ గ్లవ్మ్ దేవకి సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వమహం శరణం గతం'.

2 . సంతాన ప్రాప్తి మంత్రం

'ఓం నమో భగవతే జగత్ ప్రసూతాయ నమః' అని 108 సార్లు జపించండి. జప మాలను తీసుకుని వచ్చి మీరు జపించొచ్చు లేకపోతే మామూలుగా జపించవచ్చు. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శుభవార్త చెప్పే అవకాశం ఉంటుంది,

3. రాజరాజేశ్వరి మంత్రం

రాజరాజేశ్వరి మంత్రాన్ని జపిస్తే కూడా సంతాన భాగ్యం కలగవచ్చు. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు కొంచెం నీళ్లు తీసుకోండి. రాజరాజేశ్వరి దేవి విగ్రహం ముందు దీనిని ఉంచండి. మంత్రాన్ని చదివి దేవి మీద కొన్ని నీళ్లు సమర్పించండి. ఈ మంత్రాన్ని చదవడం వలన చాలా శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. మంచి ఫలితం ఉంటుంది.

బిడ్డకి జన్మనివ్వడానికి అవుతుంది. ‘పుమాంసం పత్రం జనే తమ్ పుమనను జయతాం భగవతి పుత్రాణాం మాతా జతనం జామ్యష్యం యాన్” ఓం నమ శక్తిరూపాయ రాజరాజేశ్వరీ మమ గ్రిహే పుత్రం కురు కురు స్వాహా.

4 గర్భ రక్షాంబికాయ్ గాయత్రీ మంత్రం

రక్షాంబికాయ్ గాయత్రి మంత్రాన్ని పఠిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. సంతాన ప్రాప్తి కలగొచ్చు. ఈ మంత్రాన్ని ప్రతి రోజు ఉదయం దేవుడు ముందు కూర్చుని జపించండి. 'ఓం గర్భరక్షాంబిగాయై చ విద్మహే మంగళ దేవదాయై చ ధీమహీ ధన్నో దేవి ప్రచోదయాత్'.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సంబంధిత కథనం