Powerful Mantras: ఈ 9 శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చు.. కష్టాలు, దోషాలు తొలగిపోవచ్చు..-chant these 9 powerful mantras to get positive energy and helps to remove doshas difficulties try these for happy life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Powerful Mantras: ఈ 9 శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చు.. కష్టాలు, దోషాలు తొలగిపోవచ్చు..

Powerful Mantras: ఈ 9 శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చు.. కష్టాలు, దోషాలు తొలగిపోవచ్చు..

Peddinti Sravya HT Telugu
Jan 16, 2025 01:30 PM IST

Powerful Mantras: జీవితంలో సంతోషం కలగలన్నా, ప్రశాంత జీవితాన్ని గడపాలనుకున్నా ఈ మంత్రాలని పఠిస్తే మంచిది. ఈ మంత్రాలని పఠిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది

Powerful Mantras: ఈ 9 శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చు
Powerful Mantras: ఈ 9 శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చు (pinterest)

ప్రతీ రోజూ కూడా మనకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. గ్రహాలలో మార్పులు వలన మనపై ఎంతో ప్రభావం పడుతుంది, ప్రశాంతంగా ఉండాలన్నా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలన్నా కొన్ని మంత్రాలని పఠించడం మంచిది. ఒక్కోసారి గ్రహాల్లో మార్పులు వలన, దోషాల వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిక్కుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది.

సంబంధిత ఫోటోలు

అయితే, జీవితంలో సంతోషం కలగలన్నా, ప్రశాంత జీవితాన్ని గడపాలనుకున్నా ఈ మంత్రాలని పఠిస్తే మంచిది. ఈ మంత్రాలని పఠిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది.

ఈ మంత్రాలని పఠిస్తే సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు

1.ఓం నమ:శ్శివాయ

శివునికి అంకితం చేయబడిన ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది. మనసుని ప్రశాంతంగా మార్చుకోవచ్చు. కర్మ, అడ్డంకుల్ని తొలగించవచ్చు. గ్రహదోషాలని తొలగించే శక్తి కూడా ఈ మంత్రానికి ఉంది. కాబట్టి ఓం నమ:శ్శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి.

2.గాయత్రీ మంత్రం

గాయత్రీ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తే కూడా ఎంతో మంచి మార్పు వస్తుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు. సంతోషంగా జీవించొచ్చు. జ్ఞానాన్ని, కాంతిని ప్రేరేపిస్తుంది. జ్యోతిష్య ప్రతికూలతలను అధిగమించడానికి శక్తి వస్తుంది.

3.హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా చదివితే కూడా ఎంతో మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం వలన కష్టాల నుంచి బయటకు రావచ్చు. అంగారక గ్రహం దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా హనుమాన్ చాలీసా పనిచేస్తుంది. మనలో ధైర్యాన్ని నింపుతుంది.

4.ఓం శని శాంతాయ నమః

ఓం శని శాంతాయ నమః మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో మంచి మార్పు వస్తుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు. సంతోషంగా ఉండొచ్చు. ఈ మంత్రాన్ని పఠిస్తే శని ఆగ్రహాన్ని తొలగించి శాంతింప చేయొచ్చు. శని దోషాన్ని తగ్గించడానికి ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిది. స్థిరత్వాన్ని కూడా తీసుకు రావొచ్చు.

5.ఓం నమో భగవతే వాసుదేవాయ

ఈ మంత్రాన్ని పఠిస్తే ఎంతో మంచి మార్పు వస్తుంది. ఈ శక్తివంతమైన విష్ణువు మంత్రాన్ని పఠిస్తే రాహు కేతువుల ప్రభావాలను ఆపచ్చు. జీవితాన్ని సమతుల్యం చేస్తుంది.

6.మహా మృత్యుంజయ మంత్రం

మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో గొప్ప మార్పు వస్తుంది. భయం, అనారోగ్యం, గ్రహాల బాధల నుంచి బయటపడవచ్చు.

7.ఓం సూర్య నమః

‘ఓం సూర్య నమః’ అనే మంత్రాన్ని పఠించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. సూర్యునికి ఇది అంకితం చేయబడింది. ఆత్మవిశ్వాసం, తేజము, స్పష్టతను పెంచుతుంది. సూర్యదోషం ఉన్నవారు ఈ మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

8.ఓం కేతవే నమః

ఓం కేతవే నమః అనే మంత్రాన్ని పఠించడం వలన అద్భుతమైన మార్పుని పొందవచ్చు. కేతువు ప్రభావాలను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది.

9.ఓం రాహవే నమః

రాహువు నుంచి మంచి ఫలితాన్ని పొందడానికి ఈ మంత్రాన్ని పఠించడం మంచిది. ఈ మంత్రాన్ని పఠించడం వలన క్లారిటీ వస్తుంది అలాగే ఈ మంత్రాన్ని జపిస్తే మంచి సానుకూల శక్తిని పొందవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం