మనం యంత్రాలను చేతులకు వేసుకోవచ్చు. లేదా సంచిలో లేదా జేబులో వుంచితే ఆపద సమయాల్లో మనల్ని రక్షిస్తాయి. ఇంట్లోని దేవుడి గదిలో ఉంచిన యంత్రాలు ఇంటి వాస్తు దోషాన్ని తొలగించి, ఇంటి సభ్యులందరికీ మంచి ఫలితాలను ఇస్తాయి. అమావాస్య, పౌర్ణమి, ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయణ పుణ్య కాలాల్లో యంత్రాలను పూజించాలి.
ఆ రోజుల్లో తూర్పు ముఖంగా ఉండి ఆయా గ్రహాల దేవతలకు సంబంధించిన మంత్రాలు, శ్లోకాలను పఠిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. యంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్బు లేదా నిమ్మకాయతో కడగకూడదు. శుభ్రమైన గుడ్డతో మాత్రమే యంత్రాలను తుడవడం చాలా మంచిది.
చంద్రుడు ప్రధానంగా మన మనస్సుపై తన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి, జాతకంలో చంద్ర దోషం ఉంటే, చంద్ర యంత్రాన్ని దేవుడి దగ్గర ఉంచి పూజించడం మంచిది. ఇలా చేయడం వల్ల కుటుంబంలోని కుమార్తెలకు చాలా మంచిది. తల్లి, పిల్లల మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. వివాహానంతరం అత్త, కోడళ్ల మధ్య బంధాన్ని పెంపొందించడానికి చంద్ర యంత్రం చాలా ఉపయోగపడుతుంది.
వెండి చంద్ర యంత్రం మరింత లాభదాయకం. రాగి యంత్రం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద, చంద్ర యంత్రం మన మనస్సును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. మనలో కోపం గుణం తగ్గుతుంది. చంద్ర యంత్రం మన మనస్సును ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడానికి దోహదపడుతుంది. అందరితో స్నేహం చేయాలని ఉంటుంది. జలుబుతో బాధపడేవారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం