Telugu News  /  Rasi Phalalu  /  Chanakya Niti Telugu Don't Make These Mistakes In Your Life
చాణక్య నీతి
చాణక్య నీతి (Twitter)

Chanakya Niti Telugu : ఈ తప్పులు చేయోద్దు.. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది

06 February 2023, 14:58 ISTHT Telugu Desk
06 February 2023, 14:58 IST

Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో సామాజిక సంక్షేమానికి సంబంధించి.. అనేక విధానాలను అందించాడు. ఈ విధానాలను అర్థం చేసుకుని.. జీవితంలో అనుసరించే వ్యక్తులకు చాలా బాధలు దూరమవుతాయని చెబుతారు. ఈ కాలంలోనూ.. చాణక్య విధానాలు బాగా ప్రాచుర్యం పొందాయి.

మానవ జీవితాన్ని విజయవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలు చాణక్య విధానంలో ఉంటాయి. చాణక్య విధానంలో భవిష్యత్తును అందంగా మార్చుకునే మార్గాలను అందించాడు. అదే విధంగా జీవితంలో విజయవంతం కావడానికి, చెడు వ్యక్తులను నివారించడానికి మార్గాలను కూడా ఇచ్చాడు. ఆచార్య చాణక్యుడు(Chanakyudu) తన నీతి శాస్త్రంలో ఇలాంటి విషయాల గురించి వివరంగా తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

దైనందిన జీవితంలో తెలిసి లేదా తెలియక పొరపాటు చేయకూడదని, దాని వల్ల లక్ష్మీ దేవి కోపానికి గురవుతుందని చెప్పారు. అయితే లక్ష్మీదేవికి కోపం వచ్చేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆచార్య చాణక్య ప్రకారం, వంటగదిలో మురికి పాత్రలను ఎప్పుడూ ఉంచకూడదు. ముఖ్యంగా రాత్రిపూట అస్సలు ఉంచడకూడదు. రాత్రిపూట పొయ్యి చుట్టూ, సింక్‌లో అలా పాత్రలు ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతారు. దీనివల్ల ఇంట్లో పేదరికం మొదలవుతుంది.

ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించడానికి కష్టపడి పని చేయాలి. అలాగే కొంత డబ్బు పొదుపు చేయాలి. దీనితో పాటు, అనవసరమైన ఖర్చును కూడా నివారించాలి. ఒక వ్యక్తి డబ్బును వ్యర్థంగా ఖర్చు చేసినా లేదా సంపదను ప్రదర్శించినా లక్ష్మీ దేవికి కోపం వస్తుంది.

దీనితో పాటు సాయంత్రం ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదని ఆచార్య చాణక్యుడి నీతి చెబుతోంది. కొంతమంది ఆ సమయంలో ఊడ్చేసి ఇంటి గుమ్మం దగ్గరో.. లేదంటే.. మూలకు చెత్త పెడతారు. లక్ష్మీ సాయంత్రం ఇంటికి వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో, ఇంటి గుమ్మం దగ్గర మురికి కనపడితే వెనక్కి వెళ్లిపోతుంది. అంతకుముందే.. క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంటి పరిసరాలను మంచిగా ఉంచుకోవాలి.

చాణక్యుడు మానవ ప్రవర్తన గురించి మరొ విషయాన్ని ప్రస్తావించాడు. చాణక్యుడు ప్రకారం పెద్దలను, స్త్రీలను, పేదలను వేధించే లేదా అవమానించే వ్యక్తి దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్లి పోతుంది. ఇతరులతో అనుచితంగా ప్రవర్తించకూడదు.