వాముతో జీవితంలో కష్టాల నుండి ఎలా బయటపడచ్చు? ఇలా చేస్తే శని-రాహు దోషాలు తొలగిపోతాయి, ధన వర్షం కురుస్తుంది!-carom seeds remedies for happy life these will remove obstacles in life doshas and provides wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వాముతో జీవితంలో కష్టాల నుండి ఎలా బయటపడచ్చు? ఇలా చేస్తే శని-రాహు దోషాలు తొలగిపోతాయి, ధన వర్షం కురుస్తుంది!

వాముతో జీవితంలో కష్టాల నుండి ఎలా బయటపడచ్చు? ఇలా చేస్తే శని-రాహు దోషాలు తొలగిపోతాయి, ధన వర్షం కురుస్తుంది!

Peddinti Sravya HT Telugu

వాముతో ఈ పరిహారాలను పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపించడంతో పాటుగా, చాలా సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ వాము పరిహారాలను పాటించవచ్చు. శని-రాహు దోషాలు నుంచి బయటపడాలంటే కూడా ఏం చేయాలో కూడా తెలుసుకుందాం.

వాముతో జీవితంలో కష్టాల నుండి ఎలా బయటపడచ్చు? (pinterest)

ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. చాలామంది సంతోషంగా ఉండాలని, ధనం కలగాలని వివిధ పరిహారాలను పాటిస్తారు. ఈ పరిహారాలను పాటించడం వలన జీవితంలో మార్పులు వస్తాయని నమ్ముతారు.

ఈరోజు జ్యోతిష్యంలో చెప్పిన శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. వంటగదిలో ఉన్న చాలా వస్తువులకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాముతో చేయవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

వాముతో ఈ పరిహారాలను పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపించడంతో పాటుగా, చాలా సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ వాము పరిహారాలను పాటించవచ్చు.

1.ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యల నుంచి బయట పడాలంటే:

నిద్రపోయే ముందు ఎర్రటి వస్త్రంలో వాము వేసి మీ దిండు కింద పెట్టండి. ఉదయాన్నే లేచిన తర్వాత ఎవరికైనా ఈ మూటను దానం చేయండి. ఇలా చేయడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

2.ప్రశాంతత, సంతోషం కలగాలంటే:

కొంత వామును తీసుకుని నీళ్లలో వేసి, ఆ తర్వాత దీనిని ఏదైనా మొక్కలో పోయండి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.

3.అవసరమైన పనులు అవ్వాలంటే:

ఎప్పటినుంచి ఏదైనా పని పై ధ్యాస పెట్టినా అది పూర్తవడం లేదనిపిస్తే, ఈ పరిహారాన్ని పాటించవచ్చు. ఇలా చేయడం వలన విజయాన్ని పొందుతారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది.

4.గౌరవ మర్యాదల కోసం:

ఏదైనా ఆలయానికి వెళ్లి వామును ఎవరికైనా అక్కడ గుళ్లో ఇచ్చేయండి. ఇలా దానం చేయడం వలన ఎప్పటి నుంచో మీ పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతుంది.

5.వాస్తు దోష నివారణకు:

వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, కొంచెం వామును ఏదైనా నదిలో కలపండి. ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. మీ సమస్యలు తగ్గుతాయి, వాస్తు దోషాలు తొలగిపోతాయి.

ఏ దిశలో పెడితే వాము మూటను పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది?

  • ఉత్తర దిశలో వాము మూటను పెట్టండి. ఇది కుబేరుని దిశ. ఈ దిశలో వామును ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పులు కూడా తీరిపోతాయి.
  • ఇంటి పశ్చిమ దిశలో వాము మూటను పెట్టండి. ఇలా చేయడం వలన శని దోషం నుంచి బయటపడవచ్చు.
  • తూర్పు దిశలో వాము పెట్టినట్లయితే జీవితంలోని సమస్యలు తగ్గిపోతాయి. ప్రశాంతంగా ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.