Mukkanuma: ముక్కనుమ నాడు ప్రయాణం చేయవచ్చా? ఈ పండుగ గురించి చాలా మందికి తెలియని 4 విషయాలు-can we travel on mukkanuma festival check these 4 things related to this festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mukkanuma: ముక్కనుమ నాడు ప్రయాణం చేయవచ్చా? ఈ పండుగ గురించి చాలా మందికి తెలియని 4 విషయాలు

Mukkanuma: ముక్కనుమ నాడు ప్రయాణం చేయవచ్చా? ఈ పండుగ గురించి చాలా మందికి తెలియని 4 విషయాలు

Peddinti Sravya HT Telugu
Jan 14, 2025 04:30 PM IST

Mukkanuma: నాలుగవ రోజు జరుపుకునే ముక్కనుమ గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి. ముక్కనుమ నాడు ఏం చేయాలి..?, ఎలాంటి వాటిని ఆచరిస్తే మంచి జరుగుతుంది..?, ఇటువంటివి ఇప్పుడు తెలుసుకుందాం.

Mukkanuma: ముక్కనుమ నాడు ప్రయాణం చేయవచ్చా?
Mukkanuma: ముక్కనుమ నాడు ప్రయాణం చేయవచ్చా? (pinterest)

హిందువులు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. మొత్తం నాలుగు రోజులు పాటు సంక్రాంతి పండుగను జరుపుతారు. నాలుగవ రోజు జరుపుకునే ముక్కనుమ గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి. ముక్కనుమ నాడు ఏం చేయాలి..?, ఎలాంటి వాటిని ఆచరిస్తే మంచి జరుగుతుంది..?, ఇటువంటివి ఇప్పుడు తెలుసుకుందాం.

yearly horoscope entry point

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. తమిళనాడులో కూడా ముక్కనుమ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజును కరినాళ్ అని వారు పిలుస్తారు. చుట్టాలని ఈరోజు కలుసుకుంటే మంచిదని భావిస్తారు. ఈరోజు బంధుత్వాలను కలుపుకోవడానికి, మంచి చెడుల్ని తెలుసుకోవడానికి మంచి రోజుగా భావిస్తారు. కుటుంబ సమేతంగా వనభోజనాలకు కూడా వెళ్తుంటారు.

1 రధం ముగ్గు

ముక్కనుమ నాడు కూడా చాలా మంది రథం ముగ్గు వేస్తారు. మామూలుగా కనుమ నాడు రథం ముగ్గులు వేస్తూ ఉంటాం. కొంతమంది ముక్కనుమ నాడు కూడా రథం ముగ్గు వేయడం జరుగుతుంది. సంకురమయ్య ఉత్తరం వైపు వెళ్తుంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను పంపించాలని అర్థం వచ్చేలా రథం ముగ్గు వేస్తారు. ముగ్గుకి ఉన్న కొసను బయటకు వెళ్లే విధంగా వేస్తారు.

2 ముక్కనుమ నాడు సావిత్రి గౌరీ వ్రతం

చాలా మంది ముక్కనుమ నాడు సావిత్రి గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పిండి వంటలని చేసే నైవేద్యంగా పెడతారు. ఆ బొమ్మలని నీళ్లలో నిమజ్జనం చేస్తారు. బొమ్మలతో ఇలా నోము చేస్తారు కనుక దీనికి బొమ్మల నోము అని కూడా పేరు.

3 ముక్కనుమ నాడు ప్రయాణాలు చేయవచ్చా?

సంక్రాంతిలో మూడవ రోజు అయినటువంటి కనుమ రోజు పొలిమేర దాటకూడదు అని నియమం ఉంది. ఇంటికి వచ్చిన ఆడపడుచుల్ని సత్కరించుకుంటారు. బహుమతులు ఇస్తారు. వీడ్కోలు పలుకుతారు. ముక్కనుమ నాడు కూడా పండుగ కాబట్టి కొంత మంది ముక్కనుమ నాడు కూడా ప్రయాణాలు చేయొద్దని అంటారు. కానీ శాస్త్రపరంగా ఎలాంటి నియమం లేదు.

4 ముక్కల పండగ

భోగి నాడు కీడు పండుగ జరుపుతారు. రెండవ రోజు అయినటువంటి సంక్రాంతి నాడు పెద్ద పండుగ జరుపుతారు. ఇక మూడవరోజు పశువుల పండుగ కనుమ పండుగను జరుపుతారు. నాల్గవ రోజున గ్రామ దేవతలను తలుచుకుంటారు. మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకనే ముక్కనుమని ముక్కల పండగ అని కూడా అంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం