Lucky zodiac signs: ఆగష్టు 25 నాటికి ఈ రాశుల వారి జీవితం యూటర్న్ తీసుకుంటుంది, లాభాలే లాభాలు-by august 25 the life of these zodiac signs will take a u turn suddenly benefits will start coming ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: ఆగష్టు 25 నాటికి ఈ రాశుల వారి జీవితం యూటర్న్ తీసుకుంటుంది, లాభాలే లాభాలు

Lucky zodiac signs: ఆగష్టు 25 నాటికి ఈ రాశుల వారి జీవితం యూటర్న్ తీసుకుంటుంది, లాభాలే లాభాలు

Gunti Soundarya HT Telugu
Aug 06, 2024 08:00 AM IST

Lucky zodiac signs: జ్యోతిషశాస్త్ర కోణం నుండి శుక్రుడు, శని మధ్య ఏర్పడే సంసప్తక యోగం చాలా ముఖ్యమైనది. ఈ యోగం పన్నెండు రాశులను ప్రభావితం చేయబోతోంది. అదెలాగో తెలుసుకోండి.

శుక్రుడు, శని కలయిక
శుక్రుడు, శని కలయిక

Lucky zodiac signs: శుక్రుడు జూలై 31, 2024న మధ్యాహ్నం 02.35 గంటలకు సింహ రాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఆగస్ట్ 24 ఉదయం 01.17 గంటలకు ఉంటుంది. శని ఇప్పటికే శుక్రుని సప్తమ రాశి అయిన కుంభ రాశిలో తిరోగమన స్థితిలో సంచరిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో శుక్రుడు, శని కలయిక జూలై 31 నుండి ఆగస్టు 25, 2024 వరకు ఉంటుంది. 

శుక్రుడు, శని గ్రహాల కలయిక వలన సంసప్తక యోగం ఏర్పడింది. జాతకంలో శుక్రుడు, శని కలిసి ఉండటంతో పాటు అన్ని ఇతర గ్రహాలు కూడా శుభ ప్రదేశాలలో కూర్చుంటే ఆ వ్యక్తికి అన్ని రకాల భౌతిక సుఖాలు లభిస్తాయి. శుక్రుడు, శని గ్రహాల మధ్య ఏర్పడిన సంసప్తక యోగం జ్యోతిషశాస్త్ర కోణం నుండి ముఖ్యమైనది. ఈ యోగం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఏ రాశుల వారి జీవితం మలుపు తిరగబోతుంది. ఎవరికి లాభాలు చేకూరతాయో తెలుసుకుందాం. 

మేష రాశి 

ఆర్థిక ప్రయోజనాలు. ఇంట్లో శుభ కార్యాలు. కొత్త ఆదాయ వనరుల సముపార్జన. పని స్వభావంలో మార్పు. ఆరోగ్య పనులపై అధిక వ్యయం.

వృషభ రాశి 

వృషభ రాశి వారికి ఈ యోగం ప్రభావంతో ముఖ్యమైన పనుల్లో విజయం. గౌరవం. అదనపు పని భారం. ఆర్థిక పురోగతి. పాత సమస్యకు పరిష్కారం. ధైర్యం పెరుగుతుంది.

మిథున రాశి 

యోగం ప్రభావంతో మిథున రాశి వారికి శుభ, అశుభ ప్రభావాలు రెండూ ప్రభావాలు కలుగుతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్త. అనారోగ్య సమస్యల వల్ల  ఖర్చులు ఎక్కువ అవుతాయి. అన్ని పనుల్లో ఓపికగా ఉండండి.

కర్కాటక రాశి 

కొత్త పని లేదా మూలధన పెట్టుబడిలో నిమగ్నత. కొత్తగా కారు లేదా ఆస్తి కొనుగోలు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు. అధిక వ్యయం. సంబంధంలో అస్థిరత.

సింహ రాశి

కొత్త సంబంధాలు. కొత్త భాగస్వామ్యం. కొన్ని పాత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ కలవరం. కొత్త పనుల వల్ల ఆర్థిక లాభాలు.

కన్యా రాశి 

కన్యా రాశి వారికి ఈ యోగం వల్ల శుభం, అశుభం రెండూ ఫలితాలు ఎదురవుతాయి.  బాధ్యతలు, వివాదాస్పద విషయాలు, ఆరోగ్య సమస్యల పరిష్కారం అవుతాయి. కొత్త పనుల్లో పాలుపంచుకుంటారు. కుటుంబంలో శుభ కార్యాలు.

తులా రాశి 

నిలిచిపోయిన పనుల్లో మంచి పురోగతి. ఆకస్మిక లాభం. కొన్ని అంచనాల పనిలో తప్పుడు నిర్ణయం నష్టానికి దారి తీస్తుంది.

వృశ్చిక రాశి 

కొత్త భాగస్వామ్యం. కొత్త కొనుగోలు. కొత్త పనుల్లో మూలధన పెట్టుబడి. పనిలో చివరి క్షణం ఆటంకం.

ధనుస్సు రాశి

వివాదాస్పద విషయాలలో విజయం. కొన్ని పాత సమస్యలకు పరిష్కారం. కొద్దిగా కలవరం. ఆర్థిక పురోగతి.

మకర రాశి 

ఆర్థిక పురోగతి. ప్రయోజనకరమైన మార్పులు. గౌరవం పొందడం. ముఖ్యమైన పనిలో విజయం. కుటుంబంలో శుభ కార్యాలు. శుభవార్తల సమృద్ధి.

కుంభ రాశి 

అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనిలో విజయం. లాభదాయకమైన ప్రయాణం. మీరు మీ పాత పనికి ప్రశంసలు పొందుతారు. పెద్ద ఆర్థిక లాభం. సడే సతి ప్రభావం తగ్గుతుంది.

మీన రాశి 

కుటుంబంలో కొన్ని వివాదాలు, ఆరోగ్య సమస్యలు. ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చుపెడతారు. ప్రమాదకర పని, పెద్ద మూలధన పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండండి.