Business Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపార దిగ్గజాలు, అపర కుబేరులు అవుతారు.. ఇందులో మీరూ ఉన్నారా?-business numerology people who born on these dates will become successful business magnets ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Business Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపార దిగ్గజాలు, అపర కుబేరులు అవుతారు.. ఇందులో మీరూ ఉన్నారా?

Business Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపార దిగ్గజాలు, అపర కుబేరులు అవుతారు.. ఇందులో మీరూ ఉన్నారా?

Peddinti Sravya HT Telugu

Business Numerology: న్యూమరాలజీ ఆధారంగా మనిషిలో దాగి ఉన్న లక్షణాలను, వారిలో ఉన్న టాలెంట్లను, కెరీర్, వైవాహిక జీవితం ఇలా చాలా విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం మంచి వ్యాపారవేత్తలు అవుతారు. కోట్లలో సంపాదిస్తారు. దేశ విదేశాల్లో వీరి పేరు మారుమ్రోగిపోతుంది.

ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపార దిగ్గజాలు, అపర కుబేరులు (pinterest)

న్యూమరాలజీ ఆధారంగా మనం ఒక వ్యక్తి భవిష్యత్తు మాత్రమే కాదు. వ్యక్తి యొక్క స్వభావం, తీరు ఎలా ఉంటాయనేది కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా మనిషిలో దాగి ఉన్న లక్షణాలను, వారిలో ఉన్న టాలెంట్లను, కెరీర్, వైవాహిక జీవితం ఇలా చాలా విషయాల గురించి తెలుసుకోవచ్చు.

మీ రాడిక్స్ నెంబర్ ని బట్టి మీరు కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవుతారో లేదో తెలుసుకోవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం మంచి వ్యాపారవేత్తలు అవుతారు. కోట్లలో సంపాదిస్తారు. దేశ విదేశాల్లో వీరి పేరు మారుమ్రోగిపోతుంది. మరి వీరిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.

ఈ తేదీల్లో పుట్టిన వారు గొప్ప వ్యాపారవేత్తలు అవుతారు

రాడిక్స్ నెంబర్ 5

న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 5 వారు మంచి వ్యాపారవేత్తలు అవుతారు. వీరి వ్యాపారాన్ని దేశ విదేశాలకు కూడా తీసుకువెళ్తారు. ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 5 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు వారి ఆలోచనలతో, ప్రణాళికలతో వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. భారీగా డబ్బులు సంపాదిస్తారు.

బుధుడు అధిపతి

రాడిక్స్ నెంబర్ 5 కి బుధుడు అధిపతి. బుధుడు తెలివితేటలు, వ్యాపారం వంటి వాటికి కారకుడు. రాడిక్స్ నెంబర్ 5 వారు చాలా తెలివైన వారు. మంచి వ్యాపారవేత్తకు ఉండాల్సిన లక్షణాలు వీరిలో ఉంటాయి. వ్యాపారాన్ని కొద్ది సమయంలోనే విస్తరించుకుంటారు.

భారీగా లాభాలని పొందుతారు. త్వరగా సక్సెస్ అవుతారు. వారి వ్యాపారాన్ని సులువుగానే వివిధ దేశాల వరకు తీసుకువెళ్తారు. రిస్క్ తీసుకోవడానికి కూడా ఏ మాత్రం భయపడరు. సులువుగా సక్సెస్ ని అందుకుంటారు. వారు ఇలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు.

కోటీశ్వరులు

సంఖ్య వారు బాధపడరు. అలా అని ఎక్కువ సంతోషపడరు. చాలా రకాల భాషల్ని మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు. చదువులో కూడా ముందుంటారు. వీరు త్వరగానే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. పేరు, ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటారు. వీళ్లు డబ్బు కోసం పని చేయరు. డబ్బే కోసం పనిచేస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం