Budha purnima 2024: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ మే 23న వచ్చింది. బుద్ధ భగవానుడు జన్మించింది, జ్ఞానోదయం పొందింది ఈరోజేనని నమ్ముతారు.
శ్రీహరి విష్ణువు తన చివరి అవతారమైన తొమ్మిదో అవతారంగా బుద్ధ భగవానుడిని భావిస్తారు. ఈ రోజున బుద్ధ జయంతి అని కూడా పిలుస్తారు. వైశాఖ పౌర్ణమి, గురు పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
ఈరోజు బౌద్ధ దేవాలయాల్లో బుద్ధ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి, జ్ఞానోదయం ఇవ్వమని కోరుకుంటూ ఉపవాసం ఆచరిస్తారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ ఏడాది బుద్ధ పౌర్ణమి నాడు అనేక శుభకార్యాలు జరుగుతున్నాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం బుద్ధ పూర్ణిమ తిధి మే 22 సాయంత్రం 6:47 గంటలకు ప్రారంభమై మే 23 రాత్రి 7.22 గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఉదయ తిథి ప్రకారం మే 23న బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ రోజు శివయోగం, సర్వార్ధ సిద్ధి యోగం, శుక్రాదిత్య యోగం, రాజభంగ యోగం, గజలక్ష్మి యోగం వంటి అనేక శుభకార్యాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు చేసే ధార్మిక కార్యాలకు ఎన్నో రెట్లు శుభ ఫలితాలను అందిస్తాయి.
వైశాఖ పౌర్ణమి సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత సత్యనారాయనణుడిని పూజించడం, రాత్రి చంద్ర దేవుడికు నీటిని సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున నీటితో నిండిన కుండను దానం చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి. గౌతమ బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం కలిగిందని నమ్ముతారు. అందుకే బుద్ధ పూర్ణిమ రోజు ఈ చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తారు. బౌద్ధ మతం ఆచరించే అన్ని దేశాల్లోనూ బుద్ధ పౌర్ణమి రోజు బోధి చెట్టు కింద దీపం వెలిగిస్తారు.
బుద్ధ పూర్ణిమ రోజు చంద్రదేవుడికి పాలలో పంచదార, అన్నం కలిపి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించి ఆమెకు 10 కౌరీలు సమర్పించాలి. పసుపు తిలకం రాయాలి. నియమానుసారం పూజ చేసిన తర్వాత కౌరీలు ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురుకావని నమ్ముతారు.
పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. రావి చెట్టు కింద తీపి పదార్థాన్ని ఉంచి చెట్టుకు నీరు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై సుఖసంతోషాలను వరంగా ఇస్తుందని భక్తుల విశ్వాసం.
వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజే బ్రహ్మదేవుడు నువ్వులు తయారు చేశాడని చెబుతారు. అందుకే ఈ రోజున నువ్వులను నీటిలో వేసి స్నానం చేయాలి. వీలైతే ఈరోజు రెండు రకాల నువ్వులను కూడా దానం చేస్తే మంచిది. పౌర్ణమి నాడు నువ్వులు, తేనెతో నిండిన పాత్రను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్న కావడమే కాకుండా జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి.