Shani jayanti 2024: శని జయంతి రోజు ఈ వస్తువు మీ ఇంటికి తెచ్చుకుని పెట్టారంటే మీకు దేనికి లోటు ఉండదు
Shani jayanti 2024: శని జయంతి రోజు శనీశ్వరుడి ఆశీస్సులు పొందేందుకు ఇదొక చక్కని మార్గం. ఆరోజు గుర్రపు షూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Shani jayanti 2024: శని జయంతి రోజు శని అశుభ ప్రభావాలను వదిలించుకోవడానికి అనేక పరిహారం మార్గాలు ఉన్నాయి. శని ఆశీస్సులు పొందటం కోసం శని జయంతి చాలా మంచి రోజు. ఈ ఏడాది శని జయంతి జూన్ 6వ తేదీ వచ్చింది.
శని చెడు దృష్టి ఉంటే అనేక కష్టాలు సమస్యలు, అనుభవించాల్సి ఉంటుంది. వాటి నుంచి బయట పడేందుకు శని జయంతి రోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకుని పెట్టుకోండి. అదే గుర్రపు షూ. దీన్ని ఇంటికి తెచ్చుకుంటే సంపద, సంతోషం, అదృష్టంతో పాటు సమస్యలన్నీ తొలగిపోతాయి.
వాస్తు ప్రకారం గుర్రపు షూను ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని ప్రధాన నియమాలు పాటించాలి. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది నెగటివిటీని తొలగిస్తుందని నమ్ముతారు. వృత్తిలో అడ్డంకులు తొలగిస్తుంది. ఇంట్లో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. ఈ గుర్రపు షూను ఇనుముతో తయారు చేస్తారు.
గుర్రం అరికాళ్ళకు బిగించి అవి సులభంగా నడవడానికి పరిగెత్తడానికి సహాయపడతాయి. ఇవి రెండు ఆకారాల్లో ఉంటాయి. మొదటి యు ఆకారంలో ఉంటే రెండోది రివర్స్ యు ఆకారంలో ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై గుర్రపు షూని ఉంచడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులపై శని దేవుడు ఆశీస్సులు కూడా ఉంటాయి. శనిజయంతి రోజు మీ ఇంటికి గుర్రపు షూను తీసుకువచ్చి పెట్టుకోవడం చాలా మంచిది. అయితే ఈ గుర్రపు పెట్టుకునేందుకు ఉన్న వాస్తు నియమాలు ఏంటో తెలుసుకుందాం.
గుర్రపు షూని ఏ దిశలో ఉంచాలి?
ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దశలో నలుపు రంగు గుర్రపు షూను ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సంపద, ఆనందం, అదృష్టాన్ని పెంచుతుంది.
వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం దక్షిణ లేదా తూర్పు దిశలో ఉంటే గుర్రపు షూను ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచుకోకూడదు.
ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి గుర్రం కుడి పాదం షూను ఇంటి ప్రధాన ద్వారం వద్ద వెళ్లడం తీయవచ్చు. దీనివల్ల డబ్బు కొర తొలగిపోతుందని నమ్ముతారు.
వాస్తు ప్రకారం శని అశుభ ప్రభావాలను వదిలించుకోవడానికి ఆవ నూనెలో నల్ల గుర్రపు శూను పెట్టి దాన్ని శమీ చెట్టు కింద పూడ్చిపెట్టాలి. ఇలా చేయడం వల్ల శని మహాదశ నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. యు ఆకారంలో ఉండే గుర్రపు షూను ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకోవడం చాలా మంచిది. అదే సమయంలో మీకు రివర్స్ యు కారంలో ఉన్న గుర్రపు షూ ఉంటే దానిపై ఖచ్చితంగా అద్దం ఉంచాలి.
గుర్రపు షూ ఉంచడం వల్ల ప్రయోజనాలు
శనిదేవుడికి ఇనుము లోహం అంటే చాలా ఇష్టం. ఈ గుర్రపు షూను ఇనుముతో తయారు చేస్తారు. నలుపు రంగు శని దేవుడికి ఇష్టమైన రంగు. ఈ రంగు వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల శని దేవుడు కుటుంబ సభ్యుల పట్ల దయ చూపిస్తాడు. శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది.
నలుపు రంగు గుర్రపు షూ ఇంట్లో ప్రధాన ద్వారానికి తగిలించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. జీవితంలో సంతోషం, శ్రేయస్సును తీసుకొస్తుంది.
గుర్రపు షూను ఇంట్లో పెట్టుకుంటే సంపద, సంతోషం, సౌభాగ్యాలు కలుగుతాయి. ఇంటికి శుభం చేకూరుతుందని నమ్ముతారు. అలాగే దీని ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. చెడు శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది.
టాపిక్