Bhogi: భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? విశిష్టత, ఆచరించాల్సిన పద్ధతులు గురించి తెలుసుకోండి-bhogi 2025 date and its significance check what to do on this day and why this festival is celebrated ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bhogi: భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? విశిష్టత, ఆచరించాల్సిన పద్ధతులు గురించి తెలుసుకోండి

Bhogi: భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? విశిష్టత, ఆచరించాల్సిన పద్ధతులు గురించి తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu
Jan 11, 2025 10:30 AM IST

Bhogi: మొదటి రోజు మనం జరుపుకునే భోగి పండుగ తేదీ, ఆ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది..? వంటి విషయాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము.

Bhogi: భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? విశిష్టత, ఆచరించాల్సిన పద్ధతులు
Bhogi: భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? విశిష్టత, ఆచరించాల్సిన పద్ధతులు

భోగి, సంక్రాతి పండుగను దక్షిణ భారతదేశంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భోగి నాడు ఎన్నో పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజులు పాటు సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. ఈ పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు. మొదటి రోజు వచ్చేది భోగి పండుగ.

yearly horoscope entry point

మొదటి రోజు మనం జరుపుకునే భోగి పండుగ తేదీ, ఆ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది..? వంటి విషయాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఈ పండుగ ఆర్థిక శ్రేయస్సుకి చిహ్నంగా జరుపుకుంటాము.

మొదటి పండుగ

సంక్రాంతి పండుగలో మొదటిది భోగి పండుగ. భోగి రోజున ఇంద్ర దేవుడు, వరుణ దేవుడిని పూజిస్తారు. వర్షాలు వచ్చి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఈ పండుగను రైతు వర్గం ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రజలు భోగి మంటలు వేస్తారు.

భోగి పండుగ ఎప్పుడు వచ్చింది?

2025 లో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. భోగి పండుగ 2025 జనవరి 13న వచ్చింది. పండుగను ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉత్సాహంగా జరుపుకుంటారు.

భోగి పండుగను ఎలా జరుపుకోవాలి?

భోగి పండుగను కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా జరుపుకుంటారు. భోగి పండుగనాడు ప్రజల తమ ఇళ్ళను శుభ్రం చేసుకుంటారు దీంతో పాటుగా ఇంటి ప్రాంగణంలో బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు.

ఇంద్రుడిని ప్రత్యేకంగా రైతులు పూజిస్తారు. రైతుల ఈ రోజున వ్యవసాయ పరికరాలన్నిటిని శుభ్రం చేసుకుంటారు. పశువులకి కూడా స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. తమ ఇళ్లల్లో ఉండే పాత వస్తువులు బట్టలు తెచ్చి మంటలు వేస్తారు. మంటలు చుట్టూ తిరుగుతూ జానపద పాటలు కూడా పాడుతూ ఉంటారు.

భోగి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

సంక్రాంతి పండుగ ఇంద్రుడి ఆరాధనకు అంకితం చేయబడింది. రైతులు ఇంద్రుడి అనుగ్రహం పొందడానికి మంచి పంటను కలగాలని కోరుకుంటూ పూర్తి ఆచారాలతో ఇంద్రుడిని ఆరాధిస్తారు.

భోగి గురించి ఈ విషయాలు తెలుసా?

సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రత తగ్గుతుంది. చలి తీవ్రంగా పెరుగుతుంది. అందుకని చల్లని వాతావరణాన్ని తట్టుకోవడానికి ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి దక్షణాయనంలో పడిన కష్టాలు బాధల్ని తట్టుకున్నందుకు వస్తున్న ఉత్తరాయన కాలంలో సుఖసంతోషాలు కలగాలని ఈ భోగి మంటలను వేయడం జరుగుతుంది.

అలాగే పురాణాల ప్రకారం రంగనాథ స్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందాలని అందుకు సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చినట్లు పలువురు చెప్తూ ఉంటారు.

ఇంద్రుడి పొగరుని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన నాడు కూడా భోగి రోజు అని అంటూ ఉంటారు. ఈశ్వరుడు నందిని రైతుల కోసం భూమి పైకి ఈరోజు పంపించారని అందుకని భోగి పండుగ చేసుకోవాలని ఇంకొందరు అంటూ ఉంటారు.

భోగి మంటలు

భోగి మంటల్లో పిడకలు వేస్తారు. అలాగే మేడి, మామిడి లాంటి ఔషధ చెట్ల కలప కూడా వేస్తూ ఉంటారు. నెయ్యిని కూడా వేస్తూ ఉంటారు ఆవు నెయ్యి, ఆవు పిడకలని వేస్తే శక్తివంతమైన గాలి దాని నుంచి విడుదలవుతుంది. అగ్ని దేవుడిని ఆరాధించడం వాయుదేవుని గౌరవించడం కూడా భోగిమంటల ద్వారా జరుగుతుందని అంటారు.

భోగి పళ్ళు, బొమ్మల కొలువు

చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు అలాగే చాలామంది ఇళ్లలో బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు. సాయంత్రం పూట బొమ్మల కొలువు భోగి పండ్లు పోయడం వంటివి చేసి పేరంటం పెట్టి వాయనం ఇస్తూ ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం