ఈనెల 8వ తేదీన భీష్మ ఏకాదశి. ఈ పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు జరుపుకుంటారు. భీష్మ పితామహుడు దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్లిన సమయం ఇది. భీష్మ ఏకాదశి నాడు మహావిష్ణువు, లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది?, ఆ రోజు ఏం చేస్తే మంచిది అనే విషయాలని తెలుసుకుందాం.
ప్రతీ సంవత్సరం వచ్చే మాఘ మాసం శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈసారి ఫిబ్రవరి 7న రాత్రి 9:26 గంటలకు మొదలవుతుంది. ఫిబ్రవరి 8న రాత్రి 8:15 తో ముగుస్తుంది. కనుక ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి పండుగను జరుపుకోవాలి. ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం వలన విశేష పలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ రోజు ఉపవాసం ఉండడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
భీష్ముడు కురుక్షేత్రంలో మరనాయాసం పొందుతూ ఉత్తరాయణం మొదలయ్యే వరకు వేచి చూశాడు. ఉత్తరాయణం మొదలయ్యాక అష్టమి నాడు దేహాన్ని విడిచి పెట్టడం మొదలుపెట్టాడు. ఏకాదశి నాడు భీష్ముడు పూర్తిగా తన తనువుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకని భీష్మ ఏకాదశిని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.