Betel Leaves to Hanuman: ఈ సమస్యలతో బాధ పడుతున్నారా? అయితే హనుమంతుడికి ఈరోజు తమలపాకులు సమర్పిస్తే, కష్టాలన్నీ తీరుతాయి!-betel leaves to hanuman what happens if we offer these leaves ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Betel Leaves To Hanuman: ఈ సమస్యలతో బాధ పడుతున్నారా? అయితే హనుమంతుడికి ఈరోజు తమలపాకులు సమర్పిస్తే, కష్టాలన్నీ తీరుతాయి!

Betel Leaves to Hanuman: ఈ సమస్యలతో బాధ పడుతున్నారా? అయితే హనుమంతుడికి ఈరోజు తమలపాకులు సమర్పిస్తే, కష్టాలన్నీ తీరుతాయి!

Peddinti Sravya HT Telugu

Betel Leaves to Hanuman: హనుమాన్ జయంతి నాడు హనుమంతుడని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందడానికి అవుతుంది. హనుమంతుడు ఆశీర్వాదాలు కలిగి సంతోషంగా ఉండొచ్చు. హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే ఎటువంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే కష్టాలన్నీ తీరుతాయి (pixabay)

హనుమంతుడిని ఆరాధించడం వలన సమస్యలన్నీ తీరిపోయి, సంతోషంగా ఉండవచ్చు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందడానికి అవుతుంది. హనుమంతుడు ఆశీర్వాదాలు కలిగి సంతోషంగా ఉండొచ్చు. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు వీటిని పాటిస్తే మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి.

ఐదు ప్రదక్షిణలు

హనుమంతుడికి 5 అంటే చాలా ఇష్టం. ఈరోజు ఐదు ప్రదక్షిణలు చేయడం వలన హనుమంతుడు మీ కష్టాలని తీరుస్తాడు. అలాగే హనుమంతుడికే 5 అరటి పండ్లను సమర్పిస్తే మంచిది.

హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే ఏమవుతుంది?

  1. హనుమంతుడిని తమలపాకులతో ఆరాధించడం వలన శాంతి, సుఖము కలుగుతాయి. అలాగే తమలపాకులతో పూజించడం వలన నాగ దోష శాంతి కూడా కలుగుతుంది.
  2. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల్ని సమర్పించడం వలన ఆరోగ్యం మెరుగు పడుతుంది.
  3. మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోవడానికి ఆంజనేయ స్వామికి తమలపాకులని సమర్పించాలి.
  4. తమలపాకుమాలను ఆంజనేయ స్వామికి సమర్పించడం వలన సంసారంలో కలతలు కూడా తొలగిపోతాయి.
  5. వ్యాపారంలో నష్టాలు తొలగిపోవడానికి కూడా ఆంజనేయ స్వామికి తమలపాకుల దండని వేయడం మంచిది. ఆ తర్వాత ఈ తమలపాకులు దండతో పాటుగా పండ్లు, దక్షిణ బ్రాహ్మణుడికి దానం ఇస్తే మంచిది.
  6. వ్యాధులు నయం కాకపోతున్నట్లయితే తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి వేసి ఆకుల్ని ప్రసాదంగా తింటే రోగాలు తొలగిపోతాయి. సుందరకాండ పారాయణం చేస్తే అన్ని కార్యాల్లో విజయాన్ని పొందవచ్చు. అలాగే తమలపాకుల హారాన్ని వేస్తే మీరు చేపట్టిన పనులు పూర్తవుతాయి. విజయాన్ని అందుకుంటారు.
  7. కోర్టు సమస్యలతో బాధపడేవారు తమలపాకులు దండను స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత ఆకుల్ని ప్రసాదంగా తింటే విజయాన్ని అందుకోవచ్చు.

ఆంజనేయ స్వామిని తమలపాకులతో ఎందుకు పూజించాలి?

ఓ రోజు సీతమ్మ తల్లి ఇచ్చిన తమలపాకుల చిలుకల్ని తింటూ రాముడు ఆంజనేయ స్వామి వద్దకు వచ్చారు. ఏంటది నోరు ఎందుకు ఎర్రగా అయిందని హనుమంతుడు అడిగాడు. రాములు వారు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని చెప్తారు. ఆ తర్వాత హనుమంతుడు ఒళ్లంతా తమలపాకుల్ని కట్టుకుని గంతులు వేయడం మొదలు పెడతారు.

ఆంజనేయస్వామి రుద్ర సంభూతుడు. ఆయనకు తమలపాకులు శాంతిని కలిగిస్తాయి. అందుకనే తమలపాకులతో హనుమంతుడిని ఆరాధించాలని అంటారు. హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే శాంతి, సుఖము కూడా లభిస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం