Gruha pravesham: గృహ ప్రవేశం చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి
Gruha pravesham:కొత్త ఇళ్లు కొనుక్కుని లేదా నచ్చినట్లుగా కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయడం ముఖ్యమైన ఘట్టం. అలా సొంతింటి కల నెరవేర్చుకుని గృహప్రవేశం చేయాలనుకునే వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, పాటించాల్సిన కొన్ని నియమాలను గురించి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
సొంత ఇళ్లు అనేది చాలా మందికి కల. కష్టపడి కొనుక్కున్న లేదా కట్టుకున్న ఇంట్లోకి వెళ్లాక అంతా శుభమే జరగాలని కోరుకుంటారు. నూతన గృహంలోకి వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని పద్ధతులను తప్పకుండా పాటించడం వల్ల ఆ ఇళ్లు ఎల్లప్పుడూ అష్ట ఐశ్యర్యాలు, ఆరోగ్యానికి నిలయంగా మారుతుందని పెద్దలు చెబుతుంటారు. త్వరలో గృహ ప్రవేశం చేయాలనుకుంటున్న వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. అవేంటంటే..
గృహ ప్రవేశ సమయంలో పాటించాల్సిన నియమాలు:
- తేదీ, ముహూర్తం:
హిందూ సంప్రదాయం ప్రకారం.. గృహప్రవేశం కార్యక్రమంలో తేదీ, సమయం అనేవి చాలా ముఖ్యమైనవి. జ్యోతిష్యుణ్ని సంప్రదించి మీ జాతకం, గ్రహస్థితుల అనుగుణంగా ఉండే తేదీ, సమయాన్ని ఎంచుకోవడం మర్చిపోకండి. మంచి ముహూర్తం అనేది మీకు అన్ని రకాల శక్తుల నుంచి ఆశీర్వాదం అందిస్తుంది. అలాగే మీ కొత్తి ఇంట్లో మీ భవిష్యత్తును సుగమం చేస్తుంది. సుఖ సంతోషాలు, ఐశ్యర్యంతో నిండేలా చేస్తుంది.
2. వాస్తు పూజ:
నిర్మాణ శాస్త్రం ప్రకారం ఏ ఇళ్లైనా నివాస యోగ్యంగా మారాలంటే వాస్తు సరిగ్గా ఉండాలి. మీ నూతన గృహాన్ని ప్రతికూల ప్రకంపనల నుంచి దూరం చేసి సానుకూల వాతావరణానం తీసుకురావనికిి, శుభప్రదంగా మార్చడానికి వాస్తు పూజ చాలా బాగా సహాపడుతుంది. ఇందుకు మీకు తెలిసిన వాస్తు శాస్త్ర నిపుణుడిని సంప్రదించి వాస్తుపూజలు చేయించడం అవసరం. వాస్తు దోషాలు కొన్ని సార్లు దరిద్రం, అనారోగ్యానికి కారణం అవుతాయి.
3. ఇంటిని శుద్ధి చేయాలి:
కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు పవిత్ర జలాన్ని చిలకరించడం, ధూపం వేయడం అనేవి చాలా ముఖ్యమైన పనులు. ఈ ఆచారం ఇంట్లోని ప్రతికూల శక్తులను బయటకు పంపించేందుకు, వాతావరణాన్ని సానుకూలంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఇంటిని శుద్ధి చేయడం ఆధ్యాత్మిక వృద్ధికీ, శ్రేయస్సుకు తగిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దేవుళ్ల ఆశీస్సులను అందిస్తుంది.
4. పవిత్ర అగ్ని:
గృహ ప్రవేశ సమయంలో హోం లేదా అగ్నిపూజ చేయడం అనేది ఇంటి శుద్దీకరణకు ప్రతీక. కుటుంబ సభ్యులంతా కలిసి హోమ గుండం చుట్టూ కూర్చుని పవిత్రమైన అగ్నిని పూజించడం వల్ల నూతన గృహం శుభపద్రంగా మారుతుంది. కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, రక్షణ అందుతుంది.
5. మంత్రోచ్చారణ:
పవిత్రమైన మంత్రాలు, శ్లోకాలను పఠించడం వల్ల మీ కొత్త ఇంటికి సానుకూల శక్తి లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి దేవతలందరి ఆశీర్వాదాలు అందుతాయి. మీ జ్యోతిష్యుని సలహా మేరకు మంత్రాలను జపిస్తూ దేవుళ్లను ప్రార్థించడం వల్ల కొత్త ఇంట్లో భవిష్యత్తు దేదీప్యమానంగా ఉంటుంది.
6. అలంకరణ:
కంటికి ఇంపుగా ఉంటేనే మనసుకు నిండుగా ఉంటుంది. గృహ ప్రవేశ సమయంలో మీ కొత్త ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా అలంకరించుకోవడం అన్ని విధాలా మంచిది. రంగులరంగుల ముగ్గులు, పూల దండలు, దీపాలతో కొత్త ఇంటిని అలంకరించుకోవడం వల్ల సంతోషకరమైన, సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి సంతోషం, ప్రేమ, ఆశీర్వాదాలు అందుతాయి. మీకు అరుదైన జ్ణాపకాలను ఇవి అందిస్తాయి.
టాపిక్