చాలా మంది చేతికి ఉంగరాలని ధరిస్తారు. రకరకాల డిజైన్లతో ఉన్న ఉంగరాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారం, వెండి, డైమండ్ ఇలా ఎవరికి ఇష్టమైన ఉంగరాలను వారు పెట్టుకుంటూ ఉంటారు. వెండి ఆభరణాలు వలన అనేక లాభాలను పొందవచ్చు. వెండి ఆభరణాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వెండి గాజులు లేదా వెండి పట్టీలు, వెండి ఉంగరాలు ఇవన్నీ కూడా ఎన్నో లాభాలను అందిస్తాయి.
వెండి చంద్రుడు, శుక్రుడికి సంబంధించినది. వెండి ఉంగరాన్ని ధరించడం వలన రెండు గ్రహాల శుభ ఫలితాలు పెరుగుతాయి. వెండి ఉంగరాన్ని ధరిస్తే బుధుడు, శుక్రుడు, శని వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గించవచ్చు. ఎవరు వెండి ఉంగరాన్ని ధరిస్తే శుభం కలుగుతుందో ఇప్పుడే తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి ఉంగరాన్ని ధరించడం వలన కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వారికి కలిసి వస్తుంది. వృషభ రాశి, తులారాశి వారు కూడా వెండి ఉంగరాన్ని ధరించవచ్చు, ఈ రాశుల వారు వెండి ఉంగరాన్ని ధరిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. సంపద పెరగడంతో పాటుగా మానసిక ప్రశాంతత ఉంటుంది.
మేష రాశి, సింహ రాశి, ధనస్సు రాశి వారు వెండి ఉంగరాన్ని పొరపాటున కూడా ధరించకూడదు. లేదంటే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఈ రాశుల వారు వెండి ఉంగరాన్ని పెట్టుకోకుండా ఉండడమే మంచిది.
వెండి ఉంగరాన్ని ధరించేటప్పుడు బొటన వేలుకి ధరిస్తే మంచిది. వెండి ఉంగరాన్ని బొటని వేలుకి ధరించడం వలన శుక్ర గ్రహం బలపడుతుంది. స్త్రీలు ఎడమ చేతి బొటన వేలుకి, పురుషులు కుడి చేతి బొట్టును వేలుకి ధరిస్తే మంచిది. సోమవారం లేదా శుక్రవారం నాడు వెండి ఉంగరాన్ని ధరిస్తే మంచిది. శనివారం నాడు వెండి ఉంగరాన్ని పొరపాటున కూడా ధరించడం మంచిది కాదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.