Tulasi Mala: తులసి మాల ధరిస్తే ఇన్ని లాభాలా? ఏ సమయంలో ధరించాలి, పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకోండి
Tulasi Mala: తులసి మాలని ధరించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి?, అసలు ఎందుకు తులసి మాలని వేసుకోవాలి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మాలను ధరిస్తే ఎన్నో లాభాలను పొందవచ్చు

చాలా మంది తులసి మాలను ధరిస్తారు. తులసి మాలని ధరించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి?, అసలు ఎందుకు తులసి మాలని వేసుకోవాలి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మాలను ధరిస్తే ఎన్నో లాభాలను పొందవచ్చు. కానీ ఈ మాలను వేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి.
తులసి మాలతో ఎన్నో లాభాలు
- తులసి మాల చాలా పవిత్రమైనది. తులసి మాలను ధరిస్తే భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
- ఈ మాలను ధరించడం వలన ఆకస్మిక మృత్యువు సాధ్యపడదు. ఒకవేళ ఆకస్మిక మృత్యువు వచ్చినా యమధూతలు దగ్గరకు రారు.
- తులసిమాలను ధరించి స్నానం చేసినట్లయితే అన్ని తీర్థాలలో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అని పద్మ పురాణంలో చెప్పబడింది.
- ప్రతికూల శక్తి మన దరి చేరకుండా ఉంటుంది.
- ఆధ్యాత్మిక శ్రేయస్సుని అందిస్తుంది.
తులసి మాలను ధరిస్తే ఆరోగ్య ప్రయోజనాలు కూడా
- తులసిమాల వేసుకుంటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.
- రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ఒత్తిడి తగ్గుతుంది.
- తులసి మాలను ధరించడం వలన మెరుగైన దృష్టిని పొందవచ్చు.
- తులసిమాలతో ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
- తులసి మాలను ధరించడం వలన భావోద్వేగాలను నిర్వహిస్తుంది. ఆందోళన కూడా తగ్గుతుంది.
తులసి మాలను ధరిస్తే ఖచ్చితంగా ఈ నియమాలని పాటించాలి
- ఈ మాలను ధరించినప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
- వివాహేతర సంబంధాలను పెట్టుకోకూడదు.
- మాంసాహారాన్ని తీసుకోకూడదు.
- జూదం ఆడకూడదు.
- ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
- తులసిమాలను మీరు వేసుకోవడానికి ముందు గంగాజలంతో శుభ్రం చేసి, ఆ తర్వాత పూజ చేసి ధరించాలి.
- తులసి మాలని ధరించిన వారు రోజూ విష్ణు సహస్రనామాలను జపించాలి.
ఏ సమయంలో తులసి మాల వేసుకోవాలి?
ఉదయం స్నానం చేసే భగవంతుని ప్రార్థించి, ఆ తర్వాత తులసిమాలని వేసుకోవడం మంచిది. భక్తితో తులసిమాలను ధరించాలి. మాలను ధరించేటప్పుడు కృష్ణుడు, విష్ణువు మంత్రాలను జపిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఒకవేళ మీరు వేసుకున్న మాల అరిగిపోయినా లేదంటే విరిగిపోయినా, ఆ మాలను తీసేసి నదిలో వదిలేసి మరో మాలను ధరించవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం