Maha Shivaratri: మహా శివరాత్రి నాడు 4 యామ పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Maha Shivaratri: శివరాత్రి రోజున మనం 4 యామల పూజ చేస్తుంటాం.మొదటి మూడు చేసేటప్పుడు ఉపవాసం ఉండాలి. ఆఖరి దానికి అవసరం లేదు. అయితే శివరాత్రి నాడు ఇలా 4 యామల పూజ చేస్తే ఎలాంటి లాభాలను పొందవచ్చు. శివరాత్రి నాడు ఏ శివలింగానికి పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.

మాఘమాసంలో చేసే పూజలు, దానధర్మాలు సంపూర్ణ సత్ఫలితాలను ఇస్తాయి.ఈ మాసంలో శివపూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.మహా ప్రదోష పూజను 2025 ఫిబ్రవరి 25న నిర్వహించాలి. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పూజ చేయాలి. శనైశ్చర జయంతి పూజ కూడా అదే రోజున చేయాలి.
సాధారణంగా శివరాత్రి రోజున మనం 4 యామల పూజ చేస్తుంటాం.మొదటి మూడు చేసేటప్పుడు ఉపవాసం ఉండటం మంచిది. అయితే చివరి యామలో ఉపవాసం ఉండాలనే నియమం లేదు. అలాగే చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారు శివరాత్రి రోజున నువ్వుల నీటితో స్నానం చేస్తే ఫలితం దక్కుతుంది. శివుడిని ఆరాదించేటప్పుడు నుదుటిపై విభూతి ధరించి మెడలో రుద్రాక్ష మాల ధరించి పూజ చేయాలి.
సాధారణంగా తూర్పు వైపుకు కూర్చుని పూజలు చేస్తూ ఉంటాము. అయితే ఈ రోజున ఇంట్లో నాలుగు యామల పూజ చేసే వారు ఉత్తరం వైపు కూర్చొని శివరాత్రి పూజను ప్రారంభించాలి. నాలుగు యామలను పూజించలేకపోతే సూర్యోదయ సమయంలో శివుడిని ఆరాధించండి. శివరాత్రి రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేయడం మంచిది. శివాభిషేకం కూడా చాలా ముఖ్యం. శివునికి జలాభిషేకం చాలా ముఖ్యం. దీన్ని కొబ్బరి నీళ్లతో చేసుకోవచ్చు.
శివరాత్రి రోజున శివారాధన ఎలా ఉండాలి, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి
- శివరాత్రి రోజున శివుడికి ఎనిమిది నమస్కారాలు చేయాలి. పన్నెండు రకాల పుష్పాలను శివుని పన్నెండు పేర్లతో పూజించాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని తూర్పు ముఖంగా కూర్చొని 108 సార్లు జపించాలి.
- గోధుమ లేదా బార్లీతో చేసిన ఆహార పదార్థాలను శివుడికి నైవేద్యంగా సమర్పించాలి.
- నది ఒడ్డున లభించే స్వచ్ఛమైన మట్టితో శివలింగాన్ని తయారు చేసే ఆచారం ఇప్పటికీ కొన్ని చోట్ల ఆచరణలో ఉంది.అనేక రకాల లింగాలు ఉన్నాయి.
- వజ్రంతో తయారుచేసిన లింగాన్ని పూజిస్తే దీర్ఘాయువు లభిస్తుంది.
- ముత్యాలతో చేసిన లింగాన్ని పూజిస్తే రక్తానికి సంబంధించిన దోషం తొలగిపోతుంది. సోదర సోదరీమణుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోతాయి.
- వైడూర్యంతోచేసిన శివ లింగాన్ని పూజిస్తే జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.విద్యలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఉండవు.ఉద్యోగ రంగంలో అందరి సహకారం ఉంటుంది.
- ఎమరాల్డ్ లింగానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది.దీనిని పూజించడం వల్ల కుటుంబంలో అన్ని రకాల పురోభివృద్ధి జరుగుతుంది.భూ వివాదాలు సమసిపోయి కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
- స్ఫటిక లింగాన్ని పూజించడం ద్వారా మనస్సులోని కోరికలు నెరవేరి, కోపం తగ్గి అందరి హృదయాలను గెలుచుకోగలుగుతారు.
- వెండి లింగాన్ని పూజిస్తే చనిపోయిన కుటుంబ పెద్దలకు విముక్తి కలుగుతుంది.
- బిల్వ పత్రాలతో శివుడిని ఆరాధిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి మనసులోని కోరికలు నెరవేరుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం