Kumbh Mela: మహా కుంభమేళా స్నానానికి వెళ్తున్నారా? స్నానం చేసే నియమాలను తెలుసుకోండి.. వీటిని పాటించకపోతే ఫలితం ఉండదు
Kumbh Mela: కుంభ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని ప్రజలు తప్పనిసరిగా అనుసరించడం మంచిది. ఇలా చేయకపోతే ప్రజలు స్నానం చేసినా ప్రయోజనాలని పొందలేరు. కుంభమేళాలో స్నానం చేసిన ఫలితం రాదు.
జనవరి 13 నుంచి యూపీలో ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా ప్రారంభం కాబోతోంది. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు ఉంటుంది. సనాతన ధర్మంలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంభమేళా జరిగినప్పుడు ఆ సమయంలో సంబంధిత ప్రాంతంలోని పవిత్ర నదుల నీరు అమృత రూపాన్ని తీసుకుంటుందని నమ్ముతారు.
ఈ సమయంలో స్నానం చేసిన వాళ్లకు పుణ్యఫలాలు లభిస్తాయి అని, మరణం తర్వాత మోక్షం లభిస్తుందని నమ్మకం. అయితే, సనాతన ధర్మం ప్రకారం కుంభమేళాలో స్నానం ఆచరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం మంచిది.
కుంభ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని ప్రజలు తప్పనిసరిగా అనుసరించడం మంచిది. ఇలా చేయకపోతే ప్రజలు స్నానం చేసినా ప్రయోజనాలని పొందలేరు. కుంభమేళాలో స్నానం చేసిన ఫలితం రాదు. కాబట్టి ఈ నియమాలని ఆచరించడం మంచిది. ప్రయాగరాజ్ కుంభమేళాలో స్నానం చేయబోతున్నట్లయితే స్నానానికి ముందు పాటించాల్సిన నియమాలు ఇక్కడ ఉన్నాయి.
కుంభమేళా స్నానానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలను పాటించండి:
మొదటి నియమం
మహాకుంభంలో నాగ సాధువులు ముందుగా స్నానం చేయాలనే నియమం ఉంది. తర్వాత ఇతర సాధువులు, అఖారాలు స్నానం చేస్తారు. తర్వాత సామాన్యులు స్నానం చేయాలి. పొరపాటున కూడా సాధువులు ముందు స్నానం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అలా చేయడం మత విరుద్ధం. సాధువులని అవమానించినట్లు అవుతుంది.
రెండవ నియమం
గృహస్తులు మహాకుంభానికి వెళుతున్నట్లయితే స్నానం చేస్తున్నప్పుడు ఐదు సార్లు స్నానం చేయాలి. ఒక గృహస్థుడు 5 సార్లు కంటే ఎక్కువ స్నానం చేయకూడదు. స్నానం చేసేటప్పుడు ఈ నియమాన్ని కూడా పాటించాలి. అవివాహిత యువకులు మాత్రం కావాల్సినన్ని సార్లు స్నానం చేయొచ్చు.
మూడవ నియమం
మహా కుంభంలో స్నానం చేసిన తర్వాత రెండు చేతులతో సూర్యునికి నీటిని సమర్పించాలి. సూర్యునికి అభిముఖంగా ఈ నైవేద్యాన్ని సమర్పించాలి. సూర్యుడికి ఇలా నీటిని సమర్పించడం వలన సూర్యుని అనుగ్రహం కలుగుతుంది.
నాలుగవ నియమం
స్నానం చేసిన తర్వాత ప్రయాగరాజ్ లోని ప్రసిద్ధ లాతే హనుమాన్ జీ ఆలయానికి వెళ్లడం మంచిది. అలాగే వాసుకి నాగ ఆలయాన్ని కూడా సందర్శించొచ్చు. ఇలా ఈ ఆలయాలకి వెళ్తే మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు.
దానం చేయవచ్చు
స్తోమతను బట్టి ఇతరులు అవసరాన్ని బట్టి ఆహారం, దుప్పట్లు లేదా తగిన వస్తువుల్ని దానం చేస్తే మంచి జరుగుతుంది. కుంభమేళాకి వెళ్లి స్నానం చేయాలనుకునే వాళ్ళు ఈ నియమాలను కచ్చితంగా అనుసరించడం వలన కుంభమేళాలో స్నానం చేసినా పుణ్య ఫలితం దక్కుతుంది.