Bedroom Vastu: నిద్ర పట్టక.. ప్రశాంతంగా ఉండలేకపోతుంటే.. ఇంట్లో ఈ పెద్ద సమస్య రావచ్చు
Bedroom Vastu: సరిగ్గా నిద్రపోలేక పోవడానికి కారణం ఒత్తిడి మాత్రమే కాదు. వాస్తు దోషాలు కూడా కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వలన కుటుంబ సభ్యులకి నిద్ర సరిగా రాదు. మంచి నిద్ర కోసం వాస్తు శాస్త్రంలో పలు నివారణలు ఉన్నాయి.
చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన వాస్తు దోషాలు తొలగిపోయి. పాజిటివిటీని పెంపొందించుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, మనం పలు నియమాలని పాటించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. కొంతమంది నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా నిద్రపోలేకపోతున్నారా? ప్రతికూల ప్రభావం పడుతోందా?

మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నట్లయితే, ఈ అద్భుతమైన వాస్తు చిట్కాలు మీకు ప్రయోజనాన్ని అందిస్తాయి. సరిగ్గా నిద్రపోలేక పోవడానికి కారణం ఒత్తిడి మాత్రమే కాదు. వాస్తు దోషాలు కూడా కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వలన కుటుంబ సభ్యులకి నిద్ర సరిగా రాదు. మంచి నిద్ర కోసం వాస్తు శాస్త్రంలో పలు నివారణలు ఉన్నాయి. వీటిని పాటిస్తే నిద్ర సమస్యని తొలగించొచ్చు.
నిద్రపట్టాలంటే ఏం చేయాలి?
- రోజంతా పని చేసుకుని ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట సరిగ్గా నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. కానీ చాలా మంది ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యని ఎదుర్కొంటున్నారు. జీవన విధానం సరిగ్గా లేకపోవడం, మానసిక ఒత్తిడి మొదలైన కారణాల వలన సరిగ్గా నిద్రపోలేకపోతూ ఉంటారు.
- పడకగదిలో కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే నిద్రలేమి సమస్య నుంచి బయటపడడానికి అవుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే పడకగది వాస్తుపై శ్రద్ధ వహించడం మంచిది.
- పడకగదిలో అద్దం పెట్టొద్దు. పడక గదిలో అద్దం ఉండడం మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, పడక గదిలో అద్దం ఉండడం వలన సరిగా నిద్ర పట్టదు. ఒకవేళ అద్దం ఉన్నట్లయితే దానిని ఏదైనా క్లాత్ తో మూసివేసి ఆ తర్వాత నిద్రపోండి. అలాగే పడక గదిలో చీపురు కట్టను కూడా పెట్టకూడదు.
ఎలక్ట్రానిక్స్ సామాన్లు
పడక గదిలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండకూడదు. టీవీ, కంప్యూటర్ వంటివి పడకగదిలో ఉండడం మంచిది కాదు. దాని వలన కూడా నిద్ర పట్టదు.
సరైన దిక్కు
నిద్రపోయేటప్పుడు మీరు ఏ దిక్కులో నిద్రపోతున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. మంచం ఎప్పుడూ కూడా ఈశాన్యం వైపు ఉండకూడదు. అలా ఉండడం వలన నిద్ర సరిగ్గా పట్టదు. సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
నేతితో దీపం
ఒకవేళ కనుక సరిగ్గా నిద్రపోలేకపోతున్నట్లయితే స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి పడకగదిలో నిద్రపోయేటప్పుడు దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన మంచి నిద్ర వస్తుంది. అలాగే ఎప్పుడూ పడక గదిలో మంచం చెక్క మంచం అయ్యి ఉండాలి. మెటల్ మంచాలను ఉపయోగించొద్దు.
మంచి నీళ్లు
ఎప్పుడూ కూడా పడకగదిలో మంచినీళ్ళని పెట్టొద్దు. మంచినీళ్లు మన మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని కలిగేటట్టు చేస్తాయి. అలాగే పడకగది పైన వాటర్ ట్యాంక్ వంటివి ఉండకుండా చూసుకోండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం