రోజూ మనం స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయడం వలన ఒళ్ళు శుభ్రం అవ్వడమే కాదు. సానుకూల శక్తి కూడా ప్రవేశిస్తుంది. మెదడు కూడా బావుంటుంది. ఇక ఇది ఇలా ఉంటే స్నానం చేసిన తర్వాత కొన్ని పొరపాట్లు చేయకూడదు. ఈ 4 పొరపాట్లు చేస్తే దురదృష్టం కలగడంతో పాటుగా చెడు దృష్టి పడుతుంది.
ఇక స్నానం చేసేటప్పుడు, స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అలవాట్లను మానుకోకపోతే రాహువు, కేతువుల ప్రభావం కారణంగా చెడు దృష్టి, దురదృష్టం వంటివి కలుగవచ్చు.
వాస్తు ప్రకారం స్నానం చేసేటప్పుడు చెప్పులని వేసుకోకూడదు. స్నానం చేసేటప్పుడు చెప్పుల్ని తొలగించి ఆ తర్వాత మాత్రమే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు చెప్పులను ధరించడం అశుభ ఫలితాన్ని అందిస్తుంది.
చాలా మంది స్నానం చేసేటప్పుడు సబ్బు నురగ నీళ్లలో పడుతుంది. ఆ నీళ్ళని బాత్రూంలో అలాగే వదిలేస్తే రాహు కేతువుల చెడు ప్రభావం కుటుంబం పై పడుతుంది. దురదృష్టం కలగడంతో పాటుగా చెడు కన్ను మీపై పడుతుంది. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బాత్రూంలో ఖాళీ బకెట్ ని ఎలా వదిలేయొద్దు. అలా వదిలేయడం వలన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒకవేళ స్నానం చేసిన తర్వాత బకెట్ ని అక్కడే వదిలేయాల్సి వస్తే తిరగేసి పెట్టాలి. ఒకవేళ ఖాళీ బకెట్ ని వదిలేస్తే ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బాత్రూం మురికిగా ఉన్నట్లయితే, అది అశుభ ఫలితాలను అందిస్తుంది. ఎప్పుడూ కూడా బాత్రూం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం