Papakshya ghat: ఈ ఘాట్లో మూడు మునకలు వేస్తే చేసిన పాపాల నుంచి, చెడు కర్మల నుంచి విముక్తి లభిస్తుంది
Papakshya ghat: చేసిన పాపం కుటుంబాన్ని దహించవేస్తుంది. ఎన్ని తరాలైనా వెంటాడుతుంది. అందుకే చేసిన చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలి.
Papakshya ghat: చేసిన పాపానికి శిక్ష తప్పదు. కొంతమంది తమ చేసిన చెడు కర్మల గురించి పశ్చాత్తాప పడతారు. భయపడతారు. దేవుడు తనకు ఏ శిక్ష విధిస్తాడోనని ఆందోళన చెందుతారు. శిక్ష మరణానికి ముందు అయినా ఉండొచ్చు, మరణానంతరం అయినా ఉండొచ్చు. ఆ పాపం నుంచి బయటపడాలంటే పాప విముక్తి చేసుకోవాల్సిందే. పాప విముక్తి పొందడం వల్ల జీవితంలో ప్రశాంతంగా బతుకగలరు. ఆధ్యాత్మికంగా మానసిక శాంతిని పొందవచ్చు. మీరు చేసిన పాపాల నుండి విముక్తి పొందాలనుకుంటే ఒడిశాలోని పాపక్షయ ఘాట్ కు వెళ్ళండి. ఇది ఒక అద్భుతమైన పవిత్ర స్థలం.
పాపక్షయ ఘాట్ పేరులోనే నీకు అర్థం అయిపోతుంది. ప్రజల పాపాలను కడిగి వేయడానికి ఇది ప్రసిద్ధి చెందినది. పాపక్షయ అనే అంటే పాప వినాశనం అని అర్థం. ఈ ఘాట్లో మూడు మునకలు వేసి స్నానం చేస్తే, మీరు చేసిన చెడు కర్మల నుంచి ఎంతో కొంత విముక్తి అయ్యే అవకాశం ఉంది.
ఈ ఘాట్ చరిత్ర ఇదే
ఈ ఘాట్ వెనుక పురాణ కథలు ఉన్నాయి. అనంత భీమదేవ్ అనే రాజు శక్తివంతమైన పాలకుడు. జ్ఞానానికి, పరాక్రమానికి ప్రసిద్ధి చెందినవాడు. అతను గొప్ప రాజు అయినప్పటికీ తన పాలనలో కొన్ని పాపాలను చేశాడు. అలాగే ఆయన కుష్టు వ్యాధితో బాధపడేవాడు. తాను చేసిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు ఒక ఋషిని కలిశాడు. ఆ ఋషి ఒడిశాలో ఉన్న పాపాక్షయ్ ఘాటుకు వెళ్లి స్నానం చేయమని ఆదేశించాడు. రుషి సలహాను అనుసరించి రాజు పాపాక్షయ్ ఘాట్లో స్నానం చేశాడు. అందులో స్నానం చేశాక ఆ రాజుకు కుష్టు వ్యాధి కూడా పోయింది. అతను చేసిన పాపాలు నుండి కూడా విముక్తి లభించింది. అప్పటినుంచి అతను ధర్మబద్ధంగా జీవించడం మొదలుపెట్టాడు.
ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో ఈ పాపాక్షయ్ ఘాటు వద్ద స్నానం చేస్తే ఎంతో పునీతులు అవుతారని చెబుతారు. చంద్రగ్రహణం సమయంలో విశ్వ శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అవి మిమ్మల్ని పరిశుద్ధులను చేస్తాయని అంటారు. వేలాదిమంది ప్రజలు స్థానికులు ఇక్కడ పవిత్ర స్నానం చేసేందుకు వస్తారు. ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో ఈ పాపాక్షయ్ ఘాట్ భక్తులతో నిండిపోయి ఉంటుంది.
పాపాక్షయ్ ఘాటుకు ఎలా వెళ్లాలి?
సోనేపూర్ టౌన్ కు ముందుగా చేరుకోవాలి. అక్కడి నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పాపాక్షయ్ ఘాట్ బింకా అనే ప్రాంతంలో ఉంటుంది. బస్సులో వెళ్లాలనుకుంటే సోనేపూర్ కు చేరుకొని అక్కడి నుంచి బస్సు మీద వెళ్లొచ్చు. ఇక పాపాక్షయ మందిర్ కు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ బర్గర్. దీని నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానంలో వచ్చేవారు ఝర్సుగూడ దగ్గరున్న వీర్ సురేంద్ర సాయి విమానాశ్రయం. ఇక్కడి నుంచి ఈ పాపాక్షయ్ ఘాట్ 124 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సోమవారం నుండి ఆదివారం వరకు... ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఆరు వరకు ఇక్కడ ఉన్న ఘాట్ దేవాలయం తెరిచే ఉంటాయి.